దుమ్ము దులుపుతున్న హిందీ సినిమా

దుమ్ము దులుపుతున్న హిందీ సినిమా

ఈ రోజుల్లో ఒక సినిమాకు బ్యాడ్ టాక్ వస్తే ఎంత వేగంగా కలెక్షన్లు పడిపోతాయో.. పాజిటివ్ టాక్ వస్తే అంతగా కలెక్షన్లు పెరిగిపోతాయి. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలన్నీ వరుసగా బోల్తా కొడుతున్నపుడు.. ఒక సినిమాకు మంచి టాక్ వస్తే జనాలు దాని మీద పడిపోతారు. ఇప్పుడు ‘సింబా’ విషయంలో అదే జరుగుతోంది. గత వారం షారుఖ్ ఖాన్ సినిమా ‘జీరో’ దారుణంగా బోల్తా కొట్టడంతో ప్రేక్షకులు నైరాశ్యంలో ఉన్నారు. ఇలాంటి టైంలో ‘సింబా’ రావడం.. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో జనాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ చిత్రానికి కలెక్షన్లు ఊహించని స్థాయిలో వస్తున్నాయి.

తొలి రోజు రణ్వీర్ సింగ్ కెరీర్లోనే అత్యధికంగా రూ. 20 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజులూ రూ.30 కోట్ల ప్లస్ చొప్పున కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లోనే రూ.74 కోట్లకు చేరుకున్నాయి ‘సింబా’ వసూళ్లు. ఇది ఇండియా లెక్క మాత్రమే. విదేశాల్లో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 5 మిలియన్ల దాకా.. అంటే రూ.35 కోట్ల దాకా వసూలు చేసి.. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసింది ‘సింబా’. సోమవారం కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయంటున్నారు. ఇక మంగళవారం నూతన సంవత్సరాది సెలవు కూడా కలిసొస్తోంది. ఈ వారమంతా కూడా ‘సింబా’ దుమ్ము దులపడం ఖాయం. ఈజీగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటే అవకాశముందీ చిత్రం. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి నిర్మించాడు. కరణ్ జోహార్ నిర్మాత.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English