బాలీవుడ్ బాటలో #2పాయింట్O క్రియేటర్

బాలీవుడ్ బాటలో #2పాయింట్O క్రియేటర్

2.0 సినిమాతో ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ కెరీర్ లో ఎప్పుడు లేనివిధంగా స్క్రిప్ట్ లను చాలా ఫాస్ట్ గా సిద్ధం చేసుకుంటున్నాడు. ఒక సినిమా ఎండ్ అయ్యే వరకు మరో కథను మొదలెట్టని శంకర్ కొన్ని పరాజయాల తరువాత వేగంగా ముందుకు సాగుతున్నాడు. గ్యాప్ ఇస్తే మణిరత్నం లాగా రేంజ్ తగ్గుతుంది అనుకున్నాడో ఏమో గాని డివైడ్ టాక్ ఎంత వచ్చినా వెరీ హై బడ్జెట్ ప్రాజెక్టులను లేపుతున్నాడు.

ప్రస్తుతం ఈ సంచలన దర్శకుడు భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ హీరోతో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా సైన్స్ ఫిక్షన్ (స్కై ఫై) థ్రిల్లర్ అన్నట్లుగా టాక్ వస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కి ముందుగానే స్క్రిప్ట్ వినిపించగా ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందినట్లు టాక్. 2.0 సినిమా విషయంలో జరిగిన తప్పులు నెక్స్ట్ ఏ మాత్రం జరగకూడదని శంకర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇక భారతీయుడు సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ దగ్గరపడే లోపు స్కై ఫై థ్రిల్లర్ ను సెట్స్ పైకి తేవాలని సన్నాహకలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి 2పాయింట్ ఓ క్రియేటర్  ఆ భారీ బడ్జెట్ సినిమాను ఏ స్థాయిలో ప్రజెంట్ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English