అబ్బబ్బా! ప్రభాస్-అనుష్క అదిరిపోయారు

అబ్బబ్బా! ప్రభాస్-అనుష్క అదిరిపోయారు

రాజస్థాన్ లో జరిగిన రాజమౌళి కొడకు పెళ్ళిలో మన టాప్ స్టార్స్ చేసిన సందడి మామూలుగా లేదు. కార్తికేయ వెడ్స్ పూజ అనేది పేరుకే కాని.. అక్కడ సందడి మాత్రం ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్ అండ్ రానాలదే. అయితే అక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ మాత్రం.. ఖచ్చితంగా అనుష్క అండ్ ప్రభాస్ కాంబినేషన్ అనే చెప్పాలి.

మా మధ్యన అస్సలు ఏం లేదు.. మేం జస్ట్ స్నేహితులమే అంటూ ఈ మధ్యనే తమ స్నేహం గురించా కాఫీ విత్ కరణ్‌ లో చెప్పాడు ప్రభాస్. అలాగే అనుష్క కూడా ప్రభాస్ వట్టి ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే అని చాలాసార్లు చెప్పాడు. కాని వీళ్ళిద్దరూ పెళ్ళిలో పక్కపక్కనే నుంచున్న తీరును చూస్తుంటే.. నిజంగానే చాలా కాలాం నుండి పెళ్ళయిన కపుల్ తరహాలో కనిపిస్తున్నారు. ఆ కుర్తాలో ప్రభాస్ ఒక బాధ్యత కలిగిన భర్తలా, ఆ ఎర్రటి పట్టుచీరలో అనుష్క ఒక గొప్పింటి కోడలు తరహాలో కనపించారు. మరి యాక్టర్లు కాబట్టి ఆ రేంజులో వీరి ఫోజింగ్ ఉందా లేదంటా నిజంగానే వీళ్ళ మధ్యన మ్యాటర్ పరిగెత్తేస్తోందా అంటే మాత్రం చెప్పలేం.

అయితే ఎవరెన్ని చెప్పినా కూడా.. వీరిద్దరూ తమ మధ్యన ఉంది స్నేహమే అంటున్నారు.. అలాగని పెళ్ళిళ్ళు కూడా చేసుకోవట్లేదు. ఏదేమైనా కూడా ఆ పెల్ళిలో నిజమైన జంటలైన చరణ్‌-ఉపాసన్ మరియు ఎన్టీఆర్-లక్ష్మీప్రణిత కంటే కూడా వీళ్ళ హంగామాయే ఎక్కువగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English