క్రియేటివిటీతో చంపేశారుగా..

క్రియేటివిటీతో చంపేశారుగా..

గత ఏడాది ‘మెంటల్ మదిలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వివేక్ ఆత్రేయ. తొలి చిత్రంతోనే తన టాలెంట్ చూపించాడతను. వెరైటీ కథ.. ఆహ్లాదకరమైన నరేషన్‌తో మెప్పించాడతను. కాకపోతే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. చూసిన వాళ్లంతా బాగుందన్నారు. మంచి రివ్యూలు వచ్చాయి. అయినా సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు. అయినా నిరాశ చెందకుండా తన కొత్త సినిమా మొదలుపెట్టి.. చకచకా పూర్తి చేసేస్తున్నాడు వివేక్.

తన తొలి సినిమా హీరో శ్రీ విష్ణుతోనే మళ్లీ జట్టు కట్టాడు వివేక్. వీళ్లిద్దరి కలయికలో రానున్న ‘బ్రోచేవారెవరురా’ టైటిల్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ చాలా క్రియేటివ్‌గా ఉండి జనాల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తోంది. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అంటూ దీనికి పెట్టిన క్యాప్షన్ భలే సరదాగా ఉంది. అలాగే టైటిల్ లోగో కింద దిష్టి బొమ్మను పెట్టి ’’ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళోవాళ్లందరి దిష్టి 2019లో మీకెవ్వరికీ తగలకూడదని ఆశిస్తూ శుభంభూయాత్’’ అని వేశారు.

ఈ దిష్టి బొమ్మతో సినిమా కథకు సంబంధం ఉండి ఉండొచ్చు. ఈ టైటిల్ లోగో గురించి ప్రకటిస్తూ రిలీజ్ చేసిన ప్రి లుక్‌లో సైతం క్రియేటివిటీ కొట్టొచ్చినట్లు కనిపించింది. కొంటెవాడు శ్రీవిష్ణు.. కొంటెది నివేతా థామస్.. తింగరోడు ప్రియదర్శి అంటూ క్యారెక్టర్లను పరిచయం చేసిన తీరూ ఆకట్టుకుంది. ‘మెంటల్ మదిలో’ హీరోయిన్ నివేతా పెతురాజ్ ఇందులో మరో కథానాయికగా నటిస్తుండటం విశేషం. తొలి ప్రయత్నంలో రొమాంటిక్ లవ్ స్టోరీ తీసిన వివేక్.. ఈసారి క్రైమ్ కామెడీ ట్రై చేస్తున్నాడు. ‘మన్యం ప్రొడక్షన్స్’ బేనర్ మీద ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నాడు. మరి వివేక్ ఆత్రేయ-శ్రీవిష్ణు జోడీ ఈసారి విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌ సక్సెస్ కూడా అందుకుంటుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English