షాకింగ్‌: కాజల్‌ విలనేసం!

షాకింగ్‌: కాజల్‌ విలనేసం!

పదేళ్లకి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోయిన్‌గా వెలగగలిగిన హీరోయిన్లు తొంభైల తర్వాత చాలా తక్కువ. అలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న కాజల్‌ ఇప్పటికీ బిజీ బిజీగా చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా వుంది. ఆమెకి 2018 అసలు కలిసి రాలేదు. చేసిన సినిమాలన్నీ ఫ్లాపయినా కానీ కాజల్‌ ఇప్పుడు బెంగ పడాల్సిన పని లేదు. ఎక్కువగా గ్లామరస్‌ పాత్రలకే కట్టుబడిన కాజల్‌ ఇక ఎక్స్‌పెరిమెంట్స్‌ మీద దృష్టి పెట్టింది.

శంకర్‌ తీస్తోన్న భారతీయుడు 2లో కాజల్‌ పాత్ర రొటీన్‌కి చాలా భిన్నంగా వుంటుందట. ఆ సంగతి అలా వుంచితే ఆమె ప్రస్తుతం చేస్తోన్న తేజ చిత్రంలో కాజల్‌ క్యారెక్టర్‌ చాలా షాకింగ్‌గా వుంటుందని సమాచారం. ఈ చిత్రంలో కాజల్‌ నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్ర పోషిస్తోందని, కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుందని, డబ్బు యావ వున్న నవీన యువతి పాత్రలో ఆమె కనిపించనుంది.

ఆమె పోషిస్తోన్న పాత్ర పేరు మీదే ఈ చిత్రానికి టైటిల్‌ కూడా డిసైడ్‌ చేయనున్నారు. 'సీత' టైటిల్‌ దీనికి పరిశీలనలో వున్నట్టు తెలిసింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరో అయినా కానీ కథ మాత్రం కాజల్‌ మీదే నడుస్తుందని, ఒక రకంగా ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్లు నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ చేయడం తెలుగు సినిమాల్లో చాలా అరుదు. ఆ లెక్కన కాజల్‌ ఈ చిత్రంతో ఆడియన్స్‌కి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుందని ఫిక్స్‌ అయిపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English