షాక్‌ నుంచి కోలుకున్న శర్వానంద్‌ రీచెక్‌

షాక్‌ నుంచి కోలుకున్న శర్వానంద్‌ రీచెక్‌

'పడి పడి లేచె మనసు' చిత్రంపై శర్వానంద్‌ చాలా ఆశలే పెట్టుకున్నాడు. యూత్‌కి ఆరాధ్య దేవతగా మారిన సాయి పల్లవి కథకి ఓకే చెప్పడంతో అతనికి సినిమాపై వున్న నమ్మకం మరింత పెరిగింది. ఎంతగా అంటే, సుధీర్‌ వర్మతో ఓకే అయిన చిత్రాన్ని కొన్నాళ్లు వాయిదా వేసి మరీ ఈ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసాడు. డెబ్బయ్‌ రోజుల్లో తీసిస్తానని చెప్పిన హను అచ్చంగా అందుకు డబుల్‌ టైమ్‌ తీసుకున్నాడు. అయినా కానీ శర్వానంద్‌ ఏమాత్రం అసహనానికి గురవలేదు. పైగా విడుదలకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన కెరియర్‌ బెస్ట్‌ మూవీ అవుతుందని స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చేసాడు. కానీ పడి పడి లేచె మనసు అతని అంచనాలని తలకిందులు చేసింది.

సాయి పల్లవి కూడా ఎలాంటి మాయ చేయలేకపోయింది. రెండవ వారానికే పూర్తిగా ఇంకిపోయిన ఈ చిత్రం చివరకు ఎనిమిది కోట్ల లోపు షేర్‌తో సరిపెట్టుకునేలా వుంది. ఈ షాక్‌ నుంచి శర్వానంద్‌ త్వరగానే కోలుకుని తదుపరి చిత్రంపై జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డాడు. సుధీర్‌ వర్మ కథ ముందే ఓకే అయినా కానీ మరోసారి రీచెక్‌ చేసుకుని 'పడిపడి'కి జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English