హమ్మయ్య,.. బన్నీకి క్లారిటీ వచ్చేసిందబ్బా

హమ్మయ్య,.. బన్నీకి క్లారిటీ వచ్చేసిందబ్బా

యావరేజ్ కంటెంట్ ఉన్న.. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో కూడా వసూళ్ల వర్షం కురిపించిన హీరో అల్లు అర్జున్. ఐతే చాలా ఏళ్లుగా ఫ్లాప్ లేకుండా సాగిపోతున్న అల్లు అర్జున్‌కు ఏడాది వ్యవధిలో రెండు షాకులు తగిలాయి. ‘దువ్వాడ జగన్నాథం’తో పాటు ‘నా పేరు సూర్య’ నిరాశ పరిచాయి. ‘డీజే’ అయినా ఓ మాదిరిగా ఆడింది కానీ.. ‘నా పేరు సూర్య’ అయితే బన్నీ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో బన్నీ ఆత్మరక్షణలో పడిపోయాడు. ‘

నా పేరు సూర్య’ వచ్చి ఆరు నెలలు దాటినా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేకపోయాడు. అసలు నెక్స్ట్ మూవీ ఏదో తేల్చనూ తేల్చకపోవడంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు. విక్రమ్ కుమార్.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో సినిమాలు ఓకే అయినట్లే అయి ఆగిపోవడం బన్నీ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఐతే ఎట్టకేలకు బన్నీ తన తర్వాతి సినిమా విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. కొత్త సంవత్సర కానుకగా బన్నీ కొత్త సినిమా ప్రకటన రాబోతోందట. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అభిమానులు హమ్మయ్య అనుకుంటున్నారు.

వాళ్లు ఆల్రెడీ బన్నీ 19వ సినిమాకు సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సంబరాలు మొదలుపెట్టేశారు. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన పరశురామ్ దర్శకత్వంలో బన్నీ తన తర్వాతి సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. బహుశా ఆ సినిమా గురించే ప్రకటన రావచ్చంటున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ సొంత బేనర్ ‘గీతా ఆర్ట్స్’లోనే చేసే అవకాశముంది. ఇంకా ఈ సినిమా గురించి కొత్త విశేషాలు ఏం చెబుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English