రవితేజ్‌కు గబ్బర్‌సింగ్‌తో అవసరమా?

రవితేజ్‌కు గబ్బర్‌సింగ్‌తో అవసరమా?

వరుసగా ఫ్లాపులతో సావాసం చేస్తున్న మాస్‌ రాజా రవితేజ, త్వరలోనే 'బలుపు' అనే మరోసినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే మనోడు ఈ సినిమాలో తన పాత రఫ్‌ లుక్‌తో పాటు, సెక్సీ భామ శృతిహాసన్‌ హాట్‌ గ్లామర్‌ను కూడా ఫుల్‌గా వాడేసుకుంటున్నాడు.  అయితే ఈ సినిమాలోని ఒక సాంగ్‌లో, మన హీరో తన ప్రియురాలి వెనుకపడేటప్పుడు, తన వెనుక ఉండే గ్యాంగ్‌ అంతటికీ గబ్బర్‌సింగ్‌ గెటప్స్‌ వేయించాడు.

అసలే అక్కడ హీరోయిన్‌ గబ్బర్‌సింగ్‌ గారి భాగ్యలక్ష్మి, అందుకే మనోడు ఇలా తనకు తప్ప వెనుకుండే గ్యాంగ్‌ అందరికీ గబ్బర్‌ గెటప్స్‌ వేయించాడట. ఇదంతా సరే, అసలు అలా గబ్బర్‌ గెటప్‌ను కామెడీ చేస్తే పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఆ విషయాన్ని లైట్‌గా తీసుకుంటారా? ఏదో షాడో సినిమాలో వెంకీలాగా హీరోనే గబ్బర్‌ గెటప్‌వేస్తే బాగానే ఉంటుంది కాని, ఇలా సైడ్‌ డ్యాన్సర్లతో గెటప్‌ వేయించి 'బలుపు' చూపిస్తే దాని వలన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశం కూడా ఉంది బాసూ...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు