అవును.. ఆయన్ని చూస్తుంటే అందరికీ అసూయే

అవును.. ఆయన్ని చూస్తుంటే అందరికీ అసూయే

‘వినయ విధేయ రామ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య గురించి మాట్లాడుతూ.. ఆయన్ని లక్కీ ప్రొడ్యూసర్‌గా అభివర్ణించాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన్ని చూసి తెలుగు పరిశ్రమలోని మిగతా నిర్మాతలు అసూయ పడుతున్నారని కూడా అన్నాడు. చిరు మాటలు అతిశయోక్తి ఏమీ కాదు. ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలకు.. ఇప్పుడు తీస్తున్న, తీయబోయే సినిమాలకు పోలికే లేదు. వరుసబెట్టి ఇలాంటి క్రేజీ కాంబినేషన్లలో భారీ సినిమాలు చేయడం అరుదైన విషయమే.

ఒకప్పుడు భగవాన్, పుల్లారావు అనే నిర్మాతలతో కలిసి బాలాజీ ఆర్ట్స్ పతాకంపై చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసేవాడు దానయ్య. కానీ తర్వాత వాళ్ల నుంచి విడిపోయి యూనివర్శల్ స్టూడియో బేనర్ పెట్టి ‘దేశముదురు’.. ‘జులాయి’ లాంటి కొంచెం పెద్ద స్థాయి చిత్రాలు తీశాడు. ఇవి బాగానే ఆడినా.. వీటికి ముందు, వెనుక వచ్చిన సినిమాలన్నీ పోయాయి. కెరీర్లో కొంచెం గ్యాప్ తీసుకున్న ఆయన.. రీఎంట్రీలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అనే బేనర్ పెట్టి భారీ సినిమాలే తీస్తున్నాడు.

ఇప్పటికే ఈ ఏడాది ‘భరత్ అనే నేను’ లాంటి భారీ చిత్రం అందించాడు. వచ్చే సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’తో పలకరించనున్నాడు. ఆపై ఆయన్నుంచి రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్‌ల కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీ రాబోతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పడు మెగాస్టార్ చిరంజీవి-త్రివిక్రమ్ సినిమా కూడా ఆయన బేనర్లోనే కన్ఫమ్ అయింది. ఈ భారీ సినిమాల వరుస చూస్తే మిగతా నిర్మాతలు అసూయ చెందకుండా ఎలా ఉంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English