మెగాస్టార్ చిరంజీవి ఆపేలా లేరే!!

మెగాస్టార్ చిరంజీవి ఆపేలా లేరే!!

దాదాపు తొమ్మిదేళ్ళ విరామం తరువాత మరోసారి తెరపై కనిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 అంటూ ఒక రీమేక్ సినిమాతో వచ్చినా కూడా, ఆ సినిమాలో తనదైన మర్క్ చూపించి, డ్యాన్సులతో మళ్లీ మెప్పించి, ఫైట్స్ లో తనకు తిరుగులేదని అనిపించి, కామెడీ టైమింగుతో  నవ్వించి.. తనలోని ఆ స్టార్ అలానే ఉన్నాడంటూ అందరికీ ప్రూవ్ చేశారు. ఆడియన్స్ కూడా ఆయనపై గుండెల్లో అభిమానం అలాగే ఉందంటూ చాటిచెప్పారులే.

ఇకపోతే వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కనిపించిన మెగాస్టార్ ను చూస్తే.. ఆయన తన సినిమా ప్రస్థానం విషయంలో కొంత ఎనర్జీతో ఉరకలేస్తూ కనిపించారు. ఆయన ఎక్సయిట్మెంట్ చూస్తుంటే.. సినిమాలు చేయడం మానేయరు అని అర్ధమైపోతోంది. అలాగే ఏదో మెల్లగా సంవత్సరానికి ఒక సినిమా అన్నట్లు కాకుండా.. ఏకంగా సంవత్సరానికి రెండు సినిమాలు చేసేస్తారేమో అనే ఊపు కనిపిస్తోంది. ఆల్రెడీ సైరా సినిమాను పూర్తి చేస్తున్న చిరంజీవి, ఆ సినిమా తరువాత కొరటాల శివతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దాని తరువాత త్రివిక్రమ్ సినిమా కూడా ఉందంటూ స్టేజీ సాక్షిగా చెప్పేశారు. ఈ లెక్కన ఇప్పుడున్న హిట్ డైరక్టర్లందరితోనూ చిరంజీవి సినిమాలు చేసేస్తారేమో అనిపిస్తోంది.

ఏదేమైనా కూడా.. రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తిన్న తరువాత.. చిరంజీవి రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో అనుకుంటే.. ఆయన ఖైదీ నెం 150తో కొత్తగా డెబ్యూ చేసిన హీరో తరహాలో దూసుకుపోతున్నారు. మెగా ఫ్యాన్స్ తో పాటుగా సినిమా లవ్వర్స్ అందరూ అందుకే ఇప్పుడు ఫుల్లు హ్యాపీస్!!


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English