విజయ్‌ దేవరకొండ చిన్న వలలో పడడు

విజయ్‌ దేవరకొండ చిన్న వలలో పడడు

విజయ్‌ దేవరకొండ సినిమా ఏదీ హిందీలో విడుదల కాలేదు కానీ అతనెవరనేది ఉత్తరాదిలో బాగా తెలుసు. అర్జున్‌రెడ్డి అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విజయ్‌ని నేషనల్‌ వైడ్‌ పాపులర్‌ చేసింది. ఏ రేంజ్‌లో అంటే అతడిని బాలీవుడ్‌ యువ హీరోయిన్లు కూడా కలల రాకుమారుడిగా ఆరాధించేంతలా. దీంతో విజయ్‌ని తమ సినిమాలో పెట్టుకోవాలని పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాది నటులకి చిన్న పాత్రలు ఆఫర్‌ చేసే అలవాటున్న బాలీవుడ్‌ విజయ్‌ దేవరకొండకి కూడా అలాగే గాలమేసింది. అయితే చిన్న వెంట్రుకతో దేవరకొండని కదపలేరని అతను నిరూపించాడు.

ఫలానా సినిమాలో నటించేస్తున్నాడంటూ వార్తలు లీక్‌ చేసి అతనిపై ఒత్తిడి పెంచి, అలాగే ఆశ కల్పించాలని చూసే టాక్టిక్స్‌ ఏవీ కూడా విజయ్‌ ముందు పని చేయలేదు. బాలీవుడ్‌లో నటించే ఆలోచన అయితే ఖచ్చితంగా వుందని, కానీ దానికి ఇంకా సమయం వుందని, పూర్తిస్థాయి హీరోగానే హిందీలో అడుగు పెడతా కానీ అతిథి పాత్రలు, సహాయ పాత్రలు జాన్తానై అనేసాడు. ఈసారి అర్జున్‌రెడ్డి లాంటి సంచలనాత్మక చిత్రం చేస్తే కనుక విజయ్‌ కళ్ళు మూసుకుని హిందీలో కూడా రిలీజ్‌ చేసేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ తన క్రేజ్‌ అలా ఇలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English