అఖిల్ సినిమా.. ఎత్తుకొచ్చిందేనా?

అఖిల్ సినిమా.. ఎత్తుకొచ్చిందేనా?

‘అఖిల్’.. ‘హలో’ సినిమాలతో షాకుల మీద షాకులు తిన్న అక్కినేని చిన్నోడు అఖిల్.. ఇక తన ఆశలన్నీ ‘మిస్టర్ మజ్ను’ మీదే పెట్టుకున్నాడు. అఖిల్ మూడో సినిమా కోసం దర్శకుడిగా ఎవరెవరినో అనుకుని చివరికి ‘తొలి ప్రేమ’తో సత్తా చాటిన వెంకీ అట్లూరిని ఫిక్స్ చేశాడు నాగ్. అతడిని లాక్ చేసి చాలా హడావుడిగా సినిమా మొదలుపెట్టించాడు.

ఫిబ్రవరిలో ‘తొలి ప్రేమ’ రిలీజైతే ఇంకో మూడు నెలల్లోపే ‘మిస్టర్ మజ్ను’ను మొదలుపెట్టేశాడు వెంకీ. ఇంత వేగంగా స్క్రిప్టు రెడీ చేసి.. ఎలా షూటింగ్ మొదలు పెట్టాడన్నది అర్థం కాని విషయం. ఒకవేళ ముందే రాసిన కథతో ఈ సినిమా చేశాడనుకున్నా.. అఖిల్‌కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి నాగార్జునను మెప్పించడమూ చిన్న విషయం కాదు. మరి ఈ స్క్రిప్టు గుట్టేంటి అన్నది ముందు నుంచి సందేహాలున్నాయి.

ఇక ‘మిస్టర్ మజ్ను’ టీజర్.. ఆ తర్వాత వచ్చిన ప్రోమోలు చూస్తుంటే మాత్రం ఇది రీమేక్ మూవీనేమో అన్న డౌట్లు కొడుతున్నాయి. బాలీవుడ్లో చాలా ఏళ్ల కిందట ‘బచ్నా యే హసీనా’ అనే సినిమా వచ్చింది. రణబీర్ కపూర్ కెరీర్ ఆరంభంలో చేసిన సినిమా ఇది. ఈ సినిమా హిట్టూ కాలేదు. అలాగని ఫ్లాపూ అవ్వలేదు. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. దీపికా పదుకొనే, బిపాసా బసు కథానాయికలుగా నటించారు.

అందులో హీరో పెద్ద ప్లేబాయ్‌గా ఉంటాడు. అమ్మాయిలతో సయ్యాటలు ఆడతారు. కానీ తర్వాత అతడికి హీరోయిన్ నుంచి షాకులు తగులుతాయి. ఆ క్రమంలో అతడిలో మార్పు వచ్చి మంచివాడిగా మారతాడు. ‘మిస్టర్ మజ్ను’ ప్రోమోల్లో ఈ ఛాయలు చాలా వరకు కనిపిస్తున్నాయి. అఖిల్ ఇందులో ప్లేబాయ్ పాత్రే చేస్తున్న సంగతి స్పష్టమవుతోంది. ‘బచ్నా యే హసీనా’ సినిమాను మన నేటివిటీకి తగ్గట్లు కొంచెం మార్చి తీస్తున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి.  త్వరలోనే దీని ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. అది చూస్తే ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English