రివైండ్‌ 18: మూవీ ఆఫ్‌ ది ఇయర్‌

రివైండ్‌ 18: మూవీ ఆఫ్‌ ది ఇయర్‌

మూవీ ఆఫ్‌ ది ఇయర్‌ కేటగిరీలో పోటీకి నిలిచే చిత్రాలు కొన్ని వున్నాయి కానీ ప్రధానంగా రంగస్థలం, మహానటి, గీత గోవిందం మధ్య పోటీ నెలకొంటుంది. మహానటి చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్‌ కలక్షన్లు కూడా వచ్చాయి. గీత గోవిందం ఆబాలగోపాలాన్ని మెప్పించిన సినిమాగా నిలిచింది.

తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ సినిమాలకి తీసిపోని వసూళ్లతో సంచలనం సృష్టించింది. అయితే ఒక మంచి సినిమాకి పెద్ద స్టార్‌ తోడయితే ఆ ప్రభంజనం ఎలా వుంటుందో రంగస్థలం చూపించింది.

అగ్ర హీరోల సినిమాలంటే ఒకే తరహా మూసలో వుంటాయనే పడికట్టు సిద్ధాంతాలని బ్రేక్‌ చేసి రంగస్థలం కంటెంట్‌కి పెద్ద పీట వేసింది. గ్లామర్‌కి ప్రాధాన్యత ఇవ్వకుండా సమంత, చరణ్‌ లాంటి స్టార్లని డీ గ్లామరైజ్డ్‌గా చూపించింది. కంటెంట్‌కి తోడు కమర్షియల్‌ ఫార్ములా జత చేస్తే క్లాస్‌ నుంచి మాస్‌ వరకు ఎంత ఆదరణ దక్కుతుందో నిరూపించింది.

మహానటి, గీత గోవిందం చిత్రాలకి కూడా బెస్ట్‌ అని ఓటేసేవాళ్లు వుంటారు కానీ రంగస్థలం మాత్రం మెజారీటీ ఓట్లని నిస్సందేహంగా దక్కించుకుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English