ముగ్గురినీ ముంచేసిన 2018

ముగ్గురినీ ముంచేసిన 2018

దాదాపు మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతోంది ఖాన్ త్రయం. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. ఆమిర్ ఖాన్‌లను మించే హీరోలు ఈ మూడు దశాబ్దాల్లో ఎవ్వరూ రాలేదు. అగ్ర స్థానం కోసం ఎప్పుడూ ఈ ముగ్గురి మధ్యే పోటీ. టాప్-3లో వీళ్ల స్థానాలు అటు ఇటు మారుతూ వచ్చాయే తప్ప.. వీళ్లను మించే స్టార్లు రాలేదు. గత కొన్నేళ్లలో మాత్రం షారుఖ్ ఖాన్ కొంచెం డౌన్ అయ్యాడు.

వీరిలో ఒకరు తగ్గినా ఒకరు జోరు చూపించేవారు. ఐతే ఈ ముగ్గరు హీరోలూ ఒకే ఏడాది విఫలం కావడం అరుదే. ఆ అరుదైన పరిణామం ఈ ఏడాది చోటు చేసుకుంది.ఖాన్ త్రయంలో ముగ్గురూ ఈ ఏడాది దారుణమైన డిజాస్టర్లందుకున్నారు.

ఈ ఏడాది రంజాన్ కానుకగా విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా ‘రేస్-3’ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ చిత్రానికి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. తర్వాత నిలబడలేదు. సల్మాన్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటి అనిపించుకుంది. ఐతే సల్మాన్‌కు ఇలాంటి ఫ్లాపులు కొత్తేమీ కాదు. కానీ దీపావళికి థియేటర్లలోకి దిగిన ఆమిర్ సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ డిజాస్టర్ కావడమే ఆశ్చర్యం.

గత పుష్కర కాలంలో ఆమిర్‌కు ఫ్లాప్ అన్నదే లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అతడికి ‘థగ్స్’ బ్రేక్ వేసింది. ఇక ఏడాది చివర్లో షారుఖ్ బాక్సాఫీస్ పరీక్షకు నిలిచాడు. ఐతే అతడి ఫ్లాపుల పరంపరను కొనసాగిస్తూ ‘జీరో’ కూడా తుస్సుమనిపించింది. దీంతో ఖాన్ త్రయం పరాజయం పరిపూర్ణమైంది. ఇలా ఒకే ఏడాది ముగ్గురు ఖాన్‌ల సినిమాలు డిజాస్టర్లవడం అరుదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English