కోన హైప్‌ స్టార్ట్‌ చేసాడు

కోన హైప్‌ స్టార్ట్‌ చేసాడు

తాను నిర్మించే చిత్రాలకి కోన వెంకట్‌ చేసే హైప్‌ ఎలాగుంటుందనేది తెలియనిది కాదు. అతను తీసిన సినిమా బాలేదంటే మీడియాదే తప్పనడానికి కూడా వెనకాడడు. గీతాంజలి మినహా కోన వెంకట్‌ నిర్మాణ భాగస్వామిగా వున్న చిత్రాలేవీ సక్సెస్‌ అయినట్టు లేవు. అయినప్పటికీ ఈమధ్య రచన తగ్గించి నిర్మాణానికే పరిమితమైన కోన వెంకట్‌ త్వరలో మరో లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అందించబోతున్నాడు. భాగమతి తర్వాత ఏ సినిమాలు చేయని అనుష్క ఈ చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. అనుష్క నేచురల్‌ పద్ధతిలో బరువు తగ్గి ఈ చిత్రం కోసం స్లిమ్‌గా తయారైంది.

ఈ చిత్రంలో అనుష్క లుక్‌ బీభత్సంగా వుంటుందని, ఆమెని చూస్తే మతి పోతుందని కోన వెంకట్‌ చెబుతున్నాడు. అనుష్క కెరియర్లోనే ఇది అత్యుత్తమ లుక్‌ అని కూడా అతను కితాబిచ్చేసాడు. కోన హైప్‌ తెలిసిన వారు దీనిని సీరియస్‌గా తీసుకోకపోవచ్చు కానీ అనుష్కని రీసెంట్‌గా చూసిన వారయితే అయిదేళ్లు వయసు తగ్గిపోయినట్టు వుందని అంటున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో మాధవన్‌ కూడా నటిస్తాడట. తెలుగు, తమిళంలో మార్కెట్‌ చేసుకోవడానికి వీలుగా కోన వెంకట్‌ పర్‌ఫెక్ట్‌గానే ప్లాన్‌ చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English