అనుష్కను ఎందుకు మార్చావ్ రాజమౌళి?

అనుష్కను ఎందుకు మార్చావ్ రాజమౌళి?

ఒకరివైపుగా మద్దతు పలికెలా ఓ మాట అన్నారు అంటే వారికి అనుభవం తక్కువైనా ఉండాలి లేక అతి ప్రేమ అయినా ఉండలి. ఆ పక్షపాతి గుణం అనేది అంత ఈజీగా రాదు. అయితే దర్శకధీరుడు రాజమౌళి నుంచి ఇటీవల అది కొట్టొచ్చినట్లు కనిపించదనే టాక్ ఒక్కసారిగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రభాస్ - రానా లపై చూపిన ప్రేమలో హీరోయిన్ లను పక్కనపెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న మనసులో మెదలకుండా ఉండదు.

రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్ - రానా తో పాటు దర్శకుడు రాజమౌళి పాల్గొన్న సంగతి తెల్సిందే. అయితే ఈ షోలో ఎన్నో విషయాలని బయటపెట్టిన జక్కన్న కరణ్ అడిగిన ఓ ప్రశ్నలో పక్షపాత ధోరణి చూపించాడు. బాహుబలిని హిందీలో తెరకెక్కిస్తే ప్రభాస్ - రానా పాత్రల్లో ఎలాంటి చేంజ్ ఉండదని చెప్పిన దర్శకుడు స్వీటీ విషయంలో మాత్రం ఆమె అభిమానులకు నెగిటివ్ ఘాటును కలిగించేలా చేశాడు.

అనుష్క పాత్రకు దీపిక పదుకొనేను సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి హీరోల పక్షపాతిగా ఆలోచించారు అనే ఫీలింగ్ కలుగుతోంది. హీరోలను మర్చనప్పుడు స్వీటీని రీ ప్లేస్ చేయలనే ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ ప్రభాస్ రానా ను మారిస్తే.. సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ ఉరుకునేవారా? అనే సందేహం కూడా రాకుండా ఉండదు. అందుకే హీరోల పేర్లు మార్చి చెప్పకుండా.. హీరోయిన్ను మాత్రం మార్చేశాడా జక్కన్న?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English