ప్రభాస్‌కు 40 ఇస్తే, జక్కన్నకు?

ప్రభాస్‌కు 40 ఇస్తే, జక్కన్నకు?

ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు హీరోలు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారనే టాపిక్‌ గురించే చర్చించుకుంటున్నారు. అందులోనూ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'బాహుబలి' చిత్రంకోసం రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ ఎంత తీసుకుంటున్నాడనేదే ఇక్కడ పెద్ద టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ ఈ చిత్రం కోసం ఏకంగా 40 కోట్లు వరకు వసూలు చేస్తున్నాడని, రెండు సంవత్సరాల కాల్‌షీట్లు ఇచ్చేసి ఈ రేంజ్‌లో తీసుకుంటున్నాడని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని విశ్లేషకులు మాత్రం అస్సలు నమ్మడంలేదు. 

ఒక ప్రక్కన పవన్‌, మహేష్‌లాంటి సీనియర్లే 15 కోట్లకు సినిమాలు చేస్తుంటే, ఎంత రెండు సంవత్సరాల డేట్స్‌ ఇస్తే మాత్రం 40 కోట్లు ఎందుకిస్తారు? పైగా ఈగ సినిమా తరువాత అసలు హీరోలతో సంబంధం లేకుండా రాజమౌళి రేంజ్‌ కూడా బాగా పెరిగింది. ఈ లెక్కన ప్రభాస్‌ 40 కోట్లు తీసుకుంటే,  రాజమౌళి కూడా ఇంకో 40 అడగాలిగా? అసలు సినిమా బడ్జెట్టే 100 కోట్లయితే, అందులో 80 కోట్లు వీళ్ళిద్దరూ తీసుకుపోతే, ఇక ఏం పెట్టి సినిమా తీస్తారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు