టాలెంటెడ్‌.. కానీ నిర్మాతలకి టెర్రర్‌

టాలెంటెడ్‌.. కానీ నిర్మాతలకి టెర్రర్‌

హను రాఘవపూడి దర్శకుడు కాక ముందు నుంచీ అతడిని చాలా హైప్‌ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. యేలేటి చంద్రశేఖర్‌ వద్ద శిష్యరికం చేసిన అతడిని దర్శకుడిగా పరిచయం చేసాడు సాయి కొర్రపాటి. వారాహి సినిమాతో దర్శకుడయ్యే సరికి రాజమౌళి ఆ చిత్రాన్ని, దర్శకుడిని విపరీతంగా ప్రమోట్‌ చేసాడు. అందాల రాక్షసి చిత్రానికి విడుదలకి ముందు ఎంతో హంగామా చేసారు. ప్రేక్షకులు పెదవి విరిచిన ఆ చిత్రం ఫెయిలైనా కానీ హనుకి 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' తీసే ఛాన్స్‌ వచ్చింది. ఈ సినిమా బాగానే ఆడింది కానీ కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అంటారు. అప్పటి నాని మార్కెట్‌ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల నష్టాలొచ్చాయన్నారు.

ఆ తర్వాత అదే నిర్మాతలు హనుతో 'లై' అనే భారీ బడ్జెట్‌ సినిమా తీసారు. నితిన్‌ మార్కెట్‌ని దృష్టిలో వుంచుకోకుండా చేసిన ఆ చిత్రం పెద్ద ఫ్లాప్‌ అయింది. అయినా కానీ హను రాఘవపూడికి వెంటనే మరో అవకాశం వచ్చింది. 'పడి పడి లేచె మనసు'కి ఫామ్‌లో వున్న హీరో హీరోయిన్లు సెట్‌ అయినా కానీ దీని బడ్జెట్‌ కూడా కంట్రోల్‌ తప్పింది. ఈ చిత్రం కూడా పరాజయం దిశగా పయనిస్తూ వుంది. క్రియేటివిటీ పేరు మీద నిర్మాతల శ్రేయస్సుని, హీరో మార్కెట్‌ని గురించి ఆలోచించకుండా హను ప్రొడ్యూసర్స్‌ని వణికిస్తున్నాడనే టాక్‌ ఇప్పుడు బాగా స్ప్రెడ్‌ అయింది. ఇకపై హనుకి అవకాశాలు మునుపటి మాదిరిగా వచ్చే ఛాన్స్‌లు లేవంటోంది ఇండస్ట్రీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English