సునీల్‌కి దెబ్బ మీద దెబ్బ

సునీల్‌కి దెబ్బ మీద దెబ్బ

కమెడియన్‌ కావడమే ఆలస్యం... మళ్లీ మునుపటి వైభవం వచ్చేస్తుందని ఆశించాడు సునీల్‌. పాపం కష్టపడి తెచ్చుకున్న సిక్స్‌ ప్యాక్‌ బాడీని త్యాగం చేసి మరీ బలవంతంగా మునుపటి ఆకారానికి వచ్చేసాడు. అయితే సునీల్‌ ఆశించిన బ్రేక్‌ని త్రివిక్రమ్‌, శ్రీను వైట్ల లాంటి దర్శకులే ఇవ్వలేకపోయారు. సునీల్‌తో వాళ్లు అప్పట్లో చేయించిన కామెడీని ఇప్పుడు వాళ్లు రిపీట్‌ చేయించలేకపోయారు.

'పడి పడి లేచె మనసు' చిత్రంలో సునీల్‌ని జాగ్రత్తగా దాచి పెట్టి సెకండ్‌ హాఫ్‌లో సర్‌ప్రైజ్‌ లెక్క వాడారు. అయితే సరయిన సీన్లు, డైలాగులు పడక ఈ క్యారెక్టర్‌ పేలలేదు. చిన్న క్యారెక్టర్‌ చేసిన వెన్నెల కిషోర్‌ అయినా రెండు నవ్వించే పంచ్‌లు వేసాడు కానీ సునీల్‌కి మాత్రం ఆశించిన కామెడీ చేసే వీలు చిక్కలేదు. కమెడియన్‌గా రీఎంట్రీలో ఇన్‌స్టంట్‌గా మునుపటి సీన్‌ వచ్చేస్తుందని అనుకున్న సునీల్‌కి అది ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తోంది.

ఇంకా ఎంత కాలం ఆగాక, ఎన్ని పాత్రలు చేసాక సునీల్‌ ఇదివరకటి ఫామ్‌లోకి వస్తాడో కానీ ఇప్పుడు చాలా మంది ఆప్షన్లు వుండడం మూలాన అతడి మీద దర్శకులు ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు అనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English