కనీసం ఎన్టీఆర్ దారి చూపిస్తాడా?

కనీసం ఎన్టీఆర్ దారి చూపిస్తాడా?

చూడగానే క్యూట్ గా కనిపించే బ్యూటీ ప్రణీత సుభాష్. స్టార్ హీరోయిన్స్ కంటే మెరిసే అందం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఎందుకో గాని ఈ బ్యూటీ గత కొంత కాలంగా ఎదో సైడ్ హీరోయిన్స్ పాత్రలతో కాలాన్ని నెట్టుకొస్తోంది. ఇతర భాషలలో కొంచెం హీరోయిన్ గా చేస్తున్నప్పటికీ టాలీవుడ్ లో అయితే గెస్ట్ రోల్స్ అన్నట్టుగా అమ్మడికి ఒక బ్రాండ్ ఏర్పడుతోంది.

హీరోయిన్ గా క్లిక్ అవ్వాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ అవ్వడం లేదు. అత్తారింటికి దారేది నుంచి మొన్న వచ్చిన హలో గురు ప్రేమ కోసమే.. వరకు ఇదే వరస. ఏ సినిమా కూడా బ్రేక్ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఆశాలన్నిటిని అమ్మడు బాలయ్య మీదే పెట్టుకుంది. ఎన్టీఆర్ బయోపిక్ లో అలనాటి నటి కృష్ణా కుమారిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రాముఖ్యం కలిగిన పాత్ర కావడంతో ఆ కొంచెం సేపు ఉండే క్యారెక్టర్ క్లిక్ అవ్వాలని కోరుకుంటోంది.

కళ్ళతోనే కొన్ని సన్నివేశాల్లో అద్భుతమైన నటనతో చిత్ర యూనిట్ ని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ కూడా సెట్ లో ఆమె పై ప్రశంసలు కురిపించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. మరి అమ్మడు ఎంతవరకు మెప్పించిందో చూడాలి. ఎన్టీఆర్ బయోపిక్ ఆమెకు టాలీవుడ్ లో ఫ్యూచర్ కోసం ఎటువంటి దారి చూపిస్తుందో కూడా చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English