ముద్దు సీన్లలో తప్పు లేదు.. కానీ చేయను

ముద్దు సీన్లలో తప్పు లేదు.. కానీ చేయను

ఈ రోజుల్లో ముద్దు సీన్లనేవి చాలా మామూలు అయిపోయాయి. ఒకప్పుడు మడి కట్టుకుని కూర్చున్న హీరోయిన్లు సైతం ఇప్పుడు మొహమాటం లేకుండా ముద్దు సీన్లలో నటించేస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో ఒక లిప్ లాక్ ఉంటేనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడు లెక్క పెట్టలేనన్ని ముద్దులుంటున్నాయి ఒక సినిమాలో.

తెలుగమ్మాయిలు ఇలాంటి వాటికి దూరం అంటారు కానీ.. ప్రియ వడ్లమాని అనే కొత్తమ్మాయి ‘హుషారు’ చిత్రంలో ముద్దుల మోత మోగించేసింది. ఇలాంటి టైంలో యంగ్ హీరోయిన్లు నేను ముద్దు సీన్లలో నటించను అని స్టేట్మెంట్ ఇవ్వడం సాహసమే. ఐతే సౌత్ ఇండియన్ యంగ్ సెన్సేషన్ సాయిపల్లవి ఆ సాహసమే చేసింది. తాను లిప్ లాక్ సీన్లలో నటించనని తేల్చి చెప్పింది.

అలాగని సినిమాల్లో అలాంటివి ఉండకూదని తాను అననని సాయిపల్లవి అంటోంది. ‘‘నా వరకు నేను ముద్దు సన్నివేశాల్లో నటించను. చిట్టి పొట్టి దుస్తులు వేసుకోను. అలాగ‌ని నేను వాటికి వ్య‌తిరేకం కూడా కాదు. అలాంటి వాటిలో త‌ప్పేమీ లేదు. కాకపోతే నాకు అవి సౌకర్యంగా ఉండవు’’ అని సాయిపల్లవి చెప్పింది. అలాగే తాను వ్యాపార ప్రకటనల్లో కూడా నటించనని సాయిపల్లవి తేల్చి చెప్పడం విశేషం.

‘‘బ్రాండింగ్ చేయ‌డం, వ్యాపార ప్రకటనల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. నాకు కావాల్సిన డబ్బు సినిమాల్లో నటించడం ద్వారా వస్తోంది. అలాంటపుడు మ‌రో కొత్త మార్గం కోసం చూడటం నాకు ఇష్టం లేదు’’ అని కుండబద్దలు కొట్టేసిందామె. ఈ రోజుల్లో ఇలా ఆలోచించే హీరోయిన్లు అరుదే కదా? అందుకే సాయిపల్లవిని ప్రేక్షకులు అంత ప్రత్యేకంగా చూస్తారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English