సున్నా అయిన సూపర్‌స్టార్‌

సున్నా అయిన సూపర్‌స్టార్‌

షారుక్‌ ఖాన్‌ ఫాన్స్‌ని వెంటాడుతోన్న పీడకలలకి ఇంకా ఫుల్‌స్టాప్‌ పడలేదు. జీరో ట్రెయిలర్‌తో ఎన్ని అంచనాలని రేకెత్తించిందో సినిమాగా అంత నిరాశ పరచింది. జీరోకి అన్ని వైపుల నుంచి అట్టర్‌ఫ్లాప్‌ రిపోర్టులు వస్తున్నాయి. టాప్‌ క్రిటిక్స్‌ అంతా ఈ చిత్రాన్ని ఎండగడుతున్నారు. మరుగుజ్జు పాత్ర కోసం షారుక్‌ పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది.

విడుదలకి ముందు వచ్చిన హైప్‌తో కనీసం ఓపెనింగ్స్‌ రికార్డులయినా అందుకుంటుందని అనుకుంటే, హాలిడే వీకెండ్‌లో కూడా ఇరవై కోట్ల నెట్‌ వసూళ్లు తెచ్చుకోలేక చేతులెత్తేసింది. థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ ఫ్లాప్‌ అయినా కానీ మొదటి రోజు వసూళ్లే యాభై కోట్లు దాటాయి. జీరో ఆ మార్కు చేరుకోవడానికి కనీసం మూడు, నాలుగు రోజులు పడుతుంది. షారుక్‌ ఖాన్‌ సినిమాలన్నీ ఇటీవల బాక్సాఫీస్‌ వద్ద పల్టీ కొడుతోన్న నేపథ్యంలో జీరో చిత్రానికి ఆడియన్స్‌ తరఫునుంచి సింపతీ కూడా వుంది.

ఎలాగైనా ఈ సినిమా హిట్‌ అవ్వాలని అంతా కోరుకున్నారు. అయితే దీనికి బ్యాడ్‌ రివ్యూస్‌ రావడంతో మొదట్లో కాసేపు నమ్మలేకపోయారు. షారుక్‌ని క్రిటిక్స్‌ టార్గెట్‌ చేస్తున్నారనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే జీరో నిజంగానే జీరో అని సాయంత్రానికి క్లియర్‌గా తెలిసిపోయింది. ఈ చిత్రం వారం రోజుల పాటు థియేటర్లలో సర్వయివ్‌ అవడం కూడా ఇంపాజిబుల్‌ అని తేలిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English