అక్కడ క్రిస్మస్ విజేత అతడే..

అక్కడ క్రిస్మస్ విజేత అతడే..

క్రిస్మస్ వీకెండ్లో ఇండియా అంతటా సినిమాల మోత మోగింది. తెలుగు.. తమిళం.. కన్నడ.. హిందీ.. ఇలా ప్రతి భాషలోనూ మంచి క్రేజున్న సినిమాలు రిలీజయ్యాయి. తెలుగులో ఈ వారం విడుదలైన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నందించేలా కనిపించడం లేదు. దేనికీ యునానమస్ హిట్ టాక్ రాలేదు. కన్నడలో విడుదలైన ‘కేజీఎఫ్’ కూడా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. హిందీ చిత్రం ‘జీరో’ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ మూడు పరిశ్రమలతో పోలిస్తే.. తమిళంలో ఈ వారం విపరీతమైన పోటీ ఉంది. అక్కడ ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజవడం విశేషం. అందులో నాలుగైదు సినిమాలు పేరున్నవే. వాటిపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ తొమ్మిది సినిమాల్లో బాక్సాఫీస్ విన్నర్ ఏదవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

విజయ్ సేతుపతి నటించిన ‘సీతాకత్తి’దే క్రిస్మస్ వీకెండ్ అని తేల్చేశారు క్రిటిక్స్, ట్రేడ్ పండిట్స్. 70 ఏళ్లు పైబడ్డ నటుడిగా విజయ్ విభిన్నమైన పాత్ర పోషించాడు ఈ చిత్రంలో. ఈ సినిమాకు అతడి నటనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘భారతీయుడు’లో సేనాపతిని తలపించే పాత్రలో విజయ్ అదరగొట్టేశాడంటున్నారు. ఇంతకుముందు అతడితోనే ‘నడువుల కొంజెం పక్కత్త కానోమ్’ అనే సూపర్ హిట్ సినిమా తీసిన బాలాజీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా అక్కడక్కడా కొంచెం వీక్‌గా ఉన్నప్పటికీ విజయ్ నిలబెట్టేశాడంటున్నారు. సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు.

మరోవైపు మంచి అంచనాల మధ్య వచ్చిన ‘మారి-2’ జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. ధనుష్ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం ఓకే కానీ.. మిగతా వాళ్లకు రుచించేలా లేదు. ఇక తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ నటించిన ‘కనా’ చాలా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడం వల్ల.. తీవ్రమైన పోటీ వల్ల ఈ సినిమా కమర్షియల‌్‌గా ఏ స్థాయికి వెళ్తుందో చెప్పలేమంటున్నారు. కంటెంట్ పరంగా అయితే ఇదే విన్నర్ కానీ.. అన్ని రకాలుగా చూసుకుంటే ‘సీతాకత్తి’కే టాప్ ప్లేస్ ఇస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English