మన జంట అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్

మన జంట అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్

గత ఏడాది ఎండింగ్ లో మొదలైన సెలబ్రెటీల వివాహాలు ఈ ఏడాది చివర వరకు బాగానే జరిగాయి. ఎప్పుడు లేని విధంగా ఈ రెండేళ్లలో ఎక్కువ మంది సెలబ్రెటీస్ వారి బాగస్వామ్యులను ఎందుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఒకటైన జంటలు ఇతర వేడుకలలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ జోడీలలో బ్యాడ్మింటన్ జోడి కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఒకే రంగానికి చెందిన సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రిసెప్షన్ తో ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీలతో ఇటీవల వేడుకను జరుపుకున్న మన జంట రీసెంట్ గా మరో ఐకనిక్ రిసెప్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మొన్న వెస్టర్న్ - హిందు సంప్రదాయ పద్దతిలో ఒక్కటైన బాలీవుడ్ - హాలీవుడ్ సెలబ్రెటీస్ ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలందరు పాల్గొన్నారు.

ఇక వారందరి లో కొత్త జంట కశ్యప్ - సైనా స్పెషల్ గా అందరిని ఆకర్షించారు. మోడ్రన్ టచ్ ఇస్తూనే సైనా తన అందంతో కెమెరాలను జిగేల్ మనిపించగా కశ్యప్ సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపించాడు. ఇక ఈ రిసెప్షన్ లో కొత్త జంటకు స్టార్ సెలబ్రెటీస్ నుంచి విషెస్ అందడమే కాకుండా వారితో కొన్ని ఫోటో మూమెంట్స్ కూడా దక్కాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English