నిహారికకి నో చెప్పలేక నాగబాబు ఇబ్బంది

నిహారికకి నో చెప్పలేక నాగబాబు ఇబ్బంది

మెగాస్టార్‌ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి వెండితెరపై కనిపించడం, మిగతా అమ్మాయిల్లా వేరే అబ్బాయిలతో రొమాన్స్‌ చేయడం ఫాన్స్‌కి నచ్చట్లేదు. అయితే నిహారికకి యాక్టింగ్‌పై వున్న ఇంట్రెస్ట్‌తో ఆమె నటిస్తానని చెప్పినా ఎవరూ అడ్డు చెప్పలేదు. ఊహించినట్టుగానే ఆమెకి మెగా అభిమానుల సహాయ సహకారాలు లభించడం లేదు. ఇప్పటికే ఆమె హీరోయిన్‌గా ఫ్లాప్‌ అయింది. ఇక సక్సెస్‌ అవుతుందనే అవకాశాలు కూడా కనిపించకపోవడంతో ఆమె ఈ ప్రయత్నాలు మానుకోవాలని నాగబాబు ఎదురు చూస్తున్నారట.

అయితే నిహారిక మాత్రం ఖచ్చితంగా సక్సెస్‌ అవుతానంటూ తనకి ఏదైనా ఆఫర్‌ రాగానే ఓకే చెప్పేస్తోందట. ఇటు నాగబాబు కానీ, అటు వరుణ్‌ తేజ్‌ కానీ ఆడపిల్లని బాధ పెట్టడం ఇష్టం లేక ఆమె కోరికని మన్నిస్తున్నారట. మరో రెండు, మూడు ప్రయత్నాలు చేసి తానే రియలైజ్‌ అవుతుందిలే అని చూస్తున్నారట. అయితే ఈలోగా నిహారికకి ఫలానా హీరోతో రిలేషన్‌ అంటూ ఎల్లో మీడియా ఆమెపై పుకార్లు పుట్టించడం మాత్రం ఆపట్లేదు. ఆమె నటించినంత కాలం ఇలాంటివి ఆపడం కష్టమని తెలుసు కనుక ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీ ఈ ఇబ్బందిని సైలెంట్‌గా మోస్తున్నారని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English