ఫేటు డిసైడ్‌ చేసేది రేటింగులే!

ఫేటు డిసైడ్‌ చేసేది రేటింగులే!

రేపు విడుదలవుతోన్న సినిమాలన్నిటికీ ఏదో ఒక ప్రత్యేకత వుంది. వీటిలో ఏది ముందుగా చూడాలనే దానిపై కూడా మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఏ ఒక్కరూ ఫలానా సినిమాని ఫేవరెట్‌గా భావించడం లేదు. దీంతో డిసెంబర్‌ 21 క్లాష్‌లో ఎవరిది అప్పర్‌ హ్యాండ్‌ అయ్యేదీ చెప్పడం కష్టంగా వుంది. దీంతో వెబ్‌సైట్‌ రేటింగులకి ఇప్పుడు చాలా వెయిట్‌ పెరిగింది. ఇంత టగ్‌ ఆఫ్‌ వార్‌ నడుస్తున్నపుడు ఎక్కువ మంది ఓటేసిన సినిమా వైపే జనం మొగ్గు చూపే అవకాశముంటుంది. దీంతో రేపు విడుదలయ్యే సినిమాలు అటు నిర్మాతలు, హీరోలు, బయ్యర్లకే కాకుండా వెబ్‌సైట్స్‌లో రివ్యూలు రాసే వారికి కూడా సవాల్‌ విసురుతున్నాయి.

పబ్లిక్‌ పల్స్‌ని కనిపెట్టడం, తప్పు జరగకుండా పారదర్శకంగా రేటింగ్స్‌ ఇవ్వడం ఇప్పుడు చాలా కీలకమవుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌ బిజినెస్‌పై అధిక ప్రభావం చూపించే ఈ రేటింగ్స్‌ కోసం మామూలుగా కంటే ఎక్కువ క్యూరియాసిటీ వుంటుంది. మరి రేపు ఏ సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందో, ఏ చిత్రానికి ఎక్కువ స్కోర్‌ పడుతుందో ఇంకొన్ని గంటల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఈలోగా ఔత్సాహికులైన కొందరు నెటిజన్లు ఫలానా రివ్యూవర్‌ రెస్పాన్స్‌ ఇలా వుంటుంది, ఫలానా వెబ్‌సైట్‌లో రేటింగ్‌ ఇంత పడుతుంది అంటూ ప్రచారం మొదలు పెట్టేసి సరదా తీర్చుకుంటున్నారనుకోండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English