శర్వానంద్‌ క్యారెక్టర్‌ ఆ క్యారెక్టర్‌కి కాపీ అట!

శర్వానంద్‌ క్యారెక్టర్‌ ఆ క్యారెక్టర్‌కి కాపీ అట!

హను రాఘవపూడిపై మణిరత్నం ప్రభావం చాలా ఎక్కువ అని అతని మొదటి సినిమా 'అందాల రాక్షసి' చూస్తే తెలిసిపోతుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'లో కూడా హను తన ప్రత్యేకత చాటుకున్నాడు. 'లై' ఫ్లాప్‌ అయినా కానీ టెక్నీషియన్‌గా తనకున్న పేరు వల్ల వెంటనే 'పడి పడి లేచె మనసు' మొదలు పెట్టాడు. ఈ చిత్రాన్ని మళ్లీ మణిరత్నం స్టయిల్లోనే హను తీసాడని చూసిన వారు చెబుతున్నారు. మణిరత్నం ప్రేమకథలు, హీరో హీరోయిన్లు ఎలా వుంటారనేది తెలిసిందే.

ఈ చిత్రాన్ని అదే శైలిలో తీసిన హను హీరో పాత్రని మాత్రం మణిరత్నం తీసిన 'మౌనరాగం' నుంచి స్ఫూర్తి పొంది రూపొందించాడట. అందులో కేవలం కాసేపే కనిపించే కార్తీక్‌ క్యారెక్టర్‌కి ఎక్స్‌టెన్షన్‌లా 'పడి పడి లేచె మనసు'లో శర్వానంద్‌ క్యారెక్టర్‌ వుంటుందట. మౌనరాగం కార్తీక్‌ పాత్రని పూర్తి స్థాయి హీరోగా మలిస్తే ఎలా వుంటుందని గతంలో చాలా మంది ట్రై చేసారు కానీ ఆ క్లాసిక్‌ని ఇంకెవరూ ముందుకి తీసుకెళ్లలేకపోయారు. మరి మణిరత్నంకి ఏకలవ్య శిష్యుడైన హను తన గురువు మ్యాజిక్‌ని రిపీట్‌ చేయగలిగాడేమో చూడాలి. శర్వానంద్‌ ఇప్పటికే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ చిత్రంలోని క్యారెక్టర్‌తో అతను యూత్‌కి హార్ట్‌త్రోబ్‌ అవుతాడంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English