అసలు జీరో అంటే ఇష్టమే లేదు

అసలు జీరో అంటే ఇష్టమే లేదు

'హసన్‌ పర్చామ్‌' అనే సాంగ్ తో ప్రస్తుతం కత్రినా కైఫ్  సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ సెక్సీ స్టార్ హీరోయిన్ గా కాకుండా స్పెషల్ రోల్స్ చేయడం అనేది చాలా తక్కువ. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా కూడా అదే క్రేజ్ ను మెయింటైన్ చేస్తూ అవకాశాలు అందుకుంటోంది. ఇకపోతే ఈ బ్యూటీ నటించిన జీరో సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలైతే ఈ సినిమాలో కత్రినా ఇష్టం లేకుండా నటించిందట.

అసలే ఎన్నో ఆశలు పెట్టుకొని కష్టపడిన అమీర్ ఖాన్ థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ బెడిసికొట్టింది. ఇక ఇప్పుడు ఏ మాత్రం నచ్చని క్యారెక్టర్ చేయడంతో సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని అంతా చర్చించుకుంటున్నారు. జీరో కథానాయకుడు షారుక్ ఖాన్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఆ పాత్ర నువ్వే చేయాలని పట్టుబట్టడంతో నటించినట్లు వివరణ ఇచ్చింది. జీరోలో మద్యానికి బానిసైన హీరోయిన్ గా ఈ బ్యూటీ కనిపించనుంది. ఆ పాత్ర కూడా కేవలం 25 నిమిషాలు ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు తన పాత్ర గురించి ఈ విధంగా స్పందించింది.

'అసలు కథ చెప్పగానే నాకు ఆ పాత్ర చేయాలని అనిపించలేదు. నిజాయితీగా చెబుతున్నా .. మిగతా పాత్రల నిడివి ఎక్కువగా ఉండడంతో నేను నటించాల్సిన అవసరం లేదని అనుకున్నా. అయితే సినిమా కథకు అదే కీలక పాత్ర అంటూ షారుక్ ఆనంద్ చెప్పడంతో కాదనలేకపోయా. ఎందుకంటే ఆనంద్ అంటే నాకు చాలా రెస్పెక్ట్.. కెరీర్ లో ఇలాంటివి కామన్. షూటింగ్ లో ఆ క్యారెక్టర్ నుంచి బయటకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. ఎదో ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించలేదు' అని కత్రినాకైఫ్ వివరణ ఇచ్చింది.

మరి అమ్మడు ఇష్టపడి చేయని ఆ సినిమాపై షారుక్ అయితే చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకంటే గత కొంత కాలంగా కింగ్ ఖాన్ కు ఒక్క హిట్టు కూడా లేదు. చాలేంజిగ్ గా తీసుకొని మరి మరగుజ్జు పాత్రలో నటించాడు. మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English