అనుష్క రెడీచ్‌!

అనుష్క రెడీచ్‌!

జీరో సైజ్‌ చిత్రం కోసం పెరిగిన బరువు అనుష్క కెరియర్‌నే ప్రమాదంలో పడేసింది. భాగమతి చిత్రాన్ని ఎలాగైతేనేం పూర్తి చేసింది కానీ అనుష్క షేప్‌ అవుట్‌ అవడం వల్ల సైరా లాంటి చిత్రాలని చేజార్చుకుంది. బరువు తగ్గడానికి ఆధునిక సదుపాయాలు వున్నా కానీ అనుష్క వాటి జోలికి పోకుండా సహజ పద్ధతులలోనే బరువు తగ్గేందుకు కృషి చేసింది. దాదాపు ఏడాది పాటు కనుమరుగైన అనుష్క ఇప్పుడు స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌గా తయారైంది. త్వరలోనే రాజమౌళి తనయుడి పెళ్లిలో మళ్లీ కెమెరాల ముందుకి రాబోతోన్న స్వీటీ మళ్లీ కథలు వినడం మొదలు పెట్టింది. ఆమె ఎప్పుడు రెడీ అయితే అప్పుడు సినిమా లాంఛ్‌ చేయడానికి కోన వెంకట్‌ ఆమెకి అడ్వాన్స్‌ ఇచ్చేసి వున్నాడు.

ఆ చిత్రాన్ని ఫిబ్రవరిలో మొదలు పెట్టే అవకాశముందని అంటున్నారు. యోగా ట్యూటర్‌ అయిన అనుష్క ఇండస్ట్రీలో చాలా మందికి ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పేది. అలాంటిది అనుష్క ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కావాలనుకుంటే రాత్రికి రాత్రి బరువు తగ్గే వీలున్న సర్జరీలు ఇప్పుడు అందుబాటులో వున్నా కానీ అది ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని తెలుసు కనుక అనుష్క పూర్తిగా సహజ పద్ధతులనే నమ్ముకుని కష్టపడి పూర్వపు రూపం సంతరించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English