అమ్మాయిలు ఇంకా రారేంటి?

అమ్మాయిలు ఇంకా రారేంటి?

మరోసారి సినిమా రిలీజ్‌ డేట్‌ కన్‌ఫామ్‌ అంటూ ఊరంతా పోస్టర్లు వేయించాడు బండ్ల గణేష్‌. ఇద్దరమ్మాయిలతో సెన్సార్‌ పూర్తవ్వడంతో,  ఇక మే 31న ఖచ్చితంగా సినిమా రిలీజంటూ ప్రకటించారు మన బ్లాక్‌బస్టర్‌ నిర్మాత. పూరి జగన్‌ దర్శకత్వంలో, అల్లు అర్జున్‌ హీరోగా రూపొందిని ఈ చిత్రంలో డస్కీ భామల అమలాపాల్‌, కత్తిలాంటి పిల్ల క్యాథరీన్‌ త్రెసాలు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.

అసలు సినిమా కథే వీరిచుట్టూ తిరుగుతుంది కాబట్టి, సినిమా టైటిల్‌ను కూడా అలానే పెట్టారు. కాని ఆశ్చర్యమేమిటంటే ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా ప్రమోషన్స్‌ కోసం రాకపోవడం. అవతల అమలాపాల్‌ తమిళ సినిమాలతో బిజీగా ఉంటే, ఇవతల క్యాథరీన్‌ కన్నడ సినిమాలతో కుమ్మేస్తోంది. మరి ఇంకో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్‌ పెట్టుకొని ఇంతవరకు ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చెయ్యకపోతే ఎలా? ఏది ఏమైనా ఇద్దరమ్మాయిలు మాత్రం గణేష్‌ను మామూలు టెన్షన్‌లో పెట్టడంలేదనుకోండి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు