ఆమెకు రాజమౌళి తండ్రి సపోర్టేంటి?

ఆమెకు రాజమౌళి తండ్రి సపోర్టేంటి?

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన మన తెలుగువాడైన క్రిష్‌ పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్న కంగనా రనౌత్‌తో చాలా సన్నిహితంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. విజయేంద్ర ప్రసాద్ సమకూర్చిన స్క్రిప్టుతో క్రిష్ ‘మణికర్ణిక’ సినిమా తీశాడు. మరి మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు. క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు.

ఏదో ప్యాచ్ వర్క్ అని.. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారని ముందు ప్రచారం జరిగింది. కానీ చివరికి వచ్చేసరికి ఈ సినిమాలో 70 శాతం డైరెక్షన్ తనదే అని క్లైమ్ చేసుకుంది కంగనా రనౌత్. టీజర్లో దర్శకుడిగా క్రిష్ ఒక్కడి పేరే వేశారు. కానీ ట్రైలర్‌కు వచ్చేసరికి డైరెక్షన్ క్రెడిట్లో కంగనా పేరు కూడా కూడా చేరింది. ఇది క్రిష్‌కు ఎంత ఇబ్బందికరమో చెప్పాల్సిన పని లేదు.

క్రిష్ నుంచి మధ్యలో కంగనా దర్శకత్వ బాధ్యతలు అందుకోవడంపై ఇంతకుముందు విజయేంద్ర ప్రసాద్‌ను ప్రశ్నిస్తే.. క్రిష్ ‘యన్.టి.ఆర్’ సినిమాను మొదలుపెట్టాల్సి ఉండటంతో ప్యాచ్ వర్క్ కోసమే కంగనా బాధ్యతలు తీసుకుందని చెప్పారు. కంగనా తీసిన సీన్లు చూస్తే క్రిష్ తీసిన వాటిలాగే ఉంటాయని.. ఆమె కూడా చక్కటి పనితీరు కనబరిచిందని కితాబిచ్చాడు. ఇప్పుడు చూస్తే కంగనా ఏమో 70 శాతం డైరెక్షన్ క్రెడిట్ తనదే అంటోంది. ఒకప్పుడు చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకు పొంతనే లేదు. క్రిష్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్న ధోరణి కనిపిస్తోంది.

ఇలాంటి తరుణంలో విజయేంద్ర మాత్రం కంగనకే మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నపుడు ఆయన ఇన్ పుట్స్ ఇచ్చారు. గైడ్ చేశారు. తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంగనా ఆయన పాద నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఐతే మనవాడైన క్రిష్‌ను అంతగా అవమానిస్తున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లి కంగనాతో అంత సన్నిహితంగా మెలగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముందు నుంచి కంగనాకు ఆయన మద్దతు ఇస్తుండటం కూడా చర్చనీయాంశమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English