మురుగదాస్ కర్చీఫ్‌లు వేస్తున్నాడా?

 మురుగదాస్ కర్చీఫ్‌లు వేస్తున్నాడా?

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌కు రెండేళ్ల ముందు ఉన్న గుర్తింపు వేరు. ఇప్పుడున్న గుర్తింపు వేరు. రాజమౌళి, శంకర్‌ల తర్వాత ఆ స్థాయి బ్రాండ్ ఇమేజ్ ఉండేది అతడికి. కానీ 'స్పైడర్', 'సర్కార్' లాంటి స్థాయికి తగని సినిమాలతో మురుగదాస్ రేంజ్ పడిపోయింది. 'స్పైడర్' అనుకోకుండా తేడా కొట్టిందేమో అనుకున్నారు కానీ.. 'సర్కార్' చూశాక మురుగదాస్ దర్శకత్వంలో పదును తగ్గిపోయిందన్న సందేహాలు మొదలయ్యాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో అతను చేయబోయే సినిమా మీద కూడా అభిమానులు అంత నమ్మకంగా లేరు. రజనీ అతడితో ఎందుకు సినిమా చేస్తున్నాడని కూడా ప్రశ్నిస్తున్నారు. మురుగలో ఇంతకుముందున్న ఆత్మవిశ్వాసం కనిపించడం లేదసలు. అతడి మాటలు తేడా కొడుతున్నాయి.

ఇంతకుముందు పబ్లిసిటీకి దూరంగా ఉంటూ వచ్చిన మురుగదాస్ ఈ మధ్య మీడియాకు ఫీలర్లు ఇస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. రజనీ సినిమా తర్వాత తాను అజిత్, విజయ్‌లతో కలిసి పని చేయబోతున్నట్లు అతను సంకేతాలిచ్చాడు. ఆల్రెడీ అజిత్-మురుగ సినిమా కన్ఫమ్ అయిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే మళ్లీ విజయ్-మురుగ కాంబో గురించి ఒక వార్త బయటికి వచ్చింది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'తుపాకి'కి ఇది సీక్వెల్ అట.

తనకు ఆ ఆలోచన ఉందని.. కథ గురించి ఆలోచిస్తున్నానని మురుగదాస్ చెప్పినట్లుగా తమిళ మీడియా చెబుతోంది. ఐతే ఇప్పుడు రజనీ సినిమా మీద ఫోకస్ చేయకుండా తర్వాతి ప్రాజెక్టుల గురించి ఈ ఫీలర్లేంటి.. ఇలా కర్చీఫ్‌లు వేసి పెట్టడం ఏంటి అంటూ మురుగను విమర్శిస్తున్నారు జనాలు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English