పేట్ట తెలుగు రిలీజ్ ట్విస్ట్

పేట్ట తెలుగు రిలీజ్ ట్విస్ట్

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా 'పేట్ట' ఉన్నట్లుండి సంక్రాంతి రేసులోకి వచ్చింది. జూన్‌లో మొదలైన ఈ చిత్రం ఇంత త్వరగా విడుదలకు ముస్తాబవుతుందని ఎవరూ అనుకోలేదు. ఐతే తమిళంలో ఈ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేస్తూ.. తెలుగు రిలీజ్ సంగతే పట్టించుకోలేదు చిత్ర నిర్మాణ సంస్థ.

విడులదకు మూడు వారాలు కూడా సమయం లేకపోగా.. ఇప్పటిదాకా తెలుగు వెర్షన్ సంగతి ఏమీ తేల్చలేదు. టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఒక పోస్టర్ వదల్లేదు. తెలుగులో ఈ చిత్రం విడుదలవుతుందన్న సంకేతాలు కూడా ఏమీ కనిపించలేదు. దీంతో తెలుగు వెర్షన్ సంక్రాంతికి లేదనే నిర్ణయానికి వచ్చేశారు ఇక్కడి ప్రేక్షకులు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి తెలుగు జనాలకు షాకిచ్చాడు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్.

'పేట్ట' తెలుగు వెర్షన్ హక్కుల్ని ఆయనే సొంతం చేసుకున్నట్లు సమాచారం. చడీచప్పుడు లేకుండా చెన్నై వెళ్లి డీల్ పూర్తి చేసుకుని వచ్చాడాయన. '2.0'ను మినహాయిస్తే గత ఏడెనిమిదేళ్లలో రజనీ సినిమాలేవీ తెలుగులో ఆడలేదు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ తక్కువ రేటుకే హక్కులు తీసుకున్నాడట. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దక్కించుకునే పలుకుబడి కూడా ఉండటంతో ఆయనకే హక్కులు ఇచ్చేసిందట సన్ పిక్చర్స్.

 ఇక వడివడిగా డబ్బింగ్ పనులు ముగించి.. ప్రమోషన్ కూడా చేపట్టి సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట కళ్యాణ్. విడుదల ముంగిట రజనీ కూడా వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తాడట. ఐతే పండక్కి 'వినయ విధేయ రామ'.. 'యన్.టి.ఆర్'.. 'ఎఫ్-2' లాంటి పెద్ద సినిమాలు రేసులో ఉండగా దీనికి థియేటర్లు ఎలా సమకూరుస్తారన్నదే అర్థం కాని విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English