బన్నీ మైక్‌ ముట్టుకోకపోతే బెటర్‌

బన్నీ మైక్‌ ముట్టుకోకపోతే బెటర్‌

అల్లు అర్జున్‌కి మైక్‌ పట్టుకుంటే ఏమవుతుందో తెలియదు కానీ ప్రతిసారీ వేదికలపై స్కూల్‌ టీచర్‌లా బిహేవ్‌ చేస్తుంటాడు. అభిమానులకి బుద్ధులు, నీతులు నేర్పించాలని చూస్తాడు లేదా పవన్‌కళ్యాణ్‌ లాంటి వాడితో గిల్లికజ్జాలు పెట్టుకుంటాడు. ఈమధ్య బన్నీ 'గారు' ఫోబియాతో సఫర్‌ అవుతున్నాడు. సినీ తారలని, పాపులర్‌ సెలబ్రిటీలని ఎవరూ గౌరవించి మాట్లాడరు.

వారు ఎదురు పడితే 'సర్‌' అంటారేమో కానీ లేనపుడు మాత్రం ఏకవచనంలోనే కాకుండా మర్యాద లేకుండా మాట్లాడతారు. 'ఎన్టీఓడు' కాలం నుంచీ వున్నదే ఇది. అయితే సినిమా తారలకి రెస్పెక్ట్‌ ఇవ్వాలని, రాజకీయ నాయకులని గౌరవించి మాట్లాడాలని, వారి పేరు చివర 'గారు' వుండాలని బన్నీ అంటున్నాడు. అనడమే కాకుండా ఈమధ్య వేదికలపై తన స్నేహితులని, సహ నటులని, చివరకు బంధువులని కూడా 'గారు' అని సంబోధిస్తున్నాడు. మొన్నామధ్య చరణ్‌ని 'రామ్‌ చరణ్‌ గారు' అనడం కాస్త వెటకారంగా అనిపించింది.

తాజాగా 'శర్వానంద్‌'ని కూడా గారు అని పిలిచి బన్నీ మరోసారి ట్రోల్స్‌ని ఆకర్షించాడు. బన్నీ కొంతకాలం మైక్‌కి దూరంగా వుండాలని, తన సినిమాల సంగతి తాను చూసుకుంటూ ఇతర విషయాల జోలికి పోకుండా వుంటే బెటర్‌ అని సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే తనకి ఏది అనిపిస్తే దాని గురించి మాట్లాడేయడం బన్నీకి అలవాటే కనుక ఇదంతా పట్టించుకోకుండా తన గారు ఉద్యమం కొనసాగించవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English