ఎన్నిసార్లు వాయిదా వేస్తావ్ రాజా?

ఎన్నిసార్లు వాయిదా వేస్తావ్ రాజా?

యువ కథానాయకుడు నిఖిల్‌కు అర్జెంటుగా ఓ హిట్టు అవసరం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత అతడి నుంచి వచ్చిన రెండు సినిమాలూ నిరాశ పరిచాయి. అందులోనూ ‘కేశవ’ అయినా ఓ మాదిరిగా ఆడింది కానీ.. ‘కిరాక్ పార్టీ’ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. దీని తర్వాత అతను ఓ రీమేక్ సినిమాను నమ్ముకున్నాడు. తమిళంలో విజయవంతమైన ‘గణిదన్’ను రీమేక్‌ చేయడానికి రెడీ అయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు నిర్మాణంలో ఒరిజినల్ డైరెక్టర్ సంతోష్‌తోనే ఈ సినిమాను మొదలుపెట్టాడు. రీమేక్ సినిమా అంటే చకచకా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తారని అనుకున్నారు. కానీ ‘ముద్ర’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా ఆలస్యమవుతోంది. ఇప్పటికి మూడు టెంటేటివ్ రిలీజ్ డేట్లు ఇచ్చారు. కానీ ఆ డేట్లను సినిమా అందుకోలేకపోయింది.

చివరగా డిసెంబరు 28న ‘ముద్ర’ రిలీజ్ అని ప్రకటించారు. కానీ డిసెంబరు వచ్చాక కూడా సినిమా ప్రమోషన్లు మొదలవ్వలేదు. అయినా కొంచెం లేటుగా ప్రచారం మొదలవుతుందనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. సినిమా గురించి ఏ ఊసూ బయటికి రాలేదు. ఆ తేదీకి ఇంకో పది రోజులే మిగిలుంది. కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయలేదంటే 28న కూడా ఈ చిత్రం విడుదల కాదని తేలిపోయింది. ఇక వచ్చే నెలంతా సంక్రాంతి సినిమాల హడావుడి ఉంటుంద. రిపబ్లిక్ డే వీకెండ్‌కు కూడా బెర్తులు ఫుల్ అయిపోయాయి. ఫిబ్రవరిలో కూడా తొలి రెండు వారాల్లో ఖాలీ లేదు. దీంతో ఈ ఏడాది ‘కిరాక్ పార్టీ’ తరహాలోనే ఫిబ్రవరి ద్వితీయార్ధం తర్వాత అన్ సీజన్లో ‘ముద్ర’ను రిలీజ్ చేసుకోక తప్పదేమో. కెరీర్‌కు కీలకమైన సినిమా విషయంలో నిఖిల్ సరైన ప్లానింగ్ చేసుకోకపోవడం అతడి అభిమానుల్ని కలవర పెడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English