ఫ్లాప్ డైరక్టర్ ను అందుకే నమ్మానంటున్నాడు

ఫ్లాప్ డైరక్టర్ ను అందుకే నమ్మానంటున్నాడు

అసలు పడిపడి లేచెను మనస్సు సినిమా మొదలైనప్పటినుండి ఒకటే ప్రశ్న. అదే ప్రశ్నను ఇప్పుడు చాలామంది శర్వానంద్ ను ఇంటర్యూలలో కూడా అడిగారట. అందుకే ఆ ప్రశ్నకు మనోడు తన స్టయిల్లో ఒక ఆన్సర్ చెప్పేశారు. ఇంతకీ ఏంటా ప్రశ్న? ఏంటా ఆన్సర్?

ఆల్రెడీ 'లై' అనే సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. అందులో ఉన్న ఎలిమెంట్లు ఏవీ కూడా ఎవ్వరికీ కనక్ట్ అవ్వలేదు. అయితే ఆ సినిమా తీసిన దర్శకుడు హను రాఘవపూడికి తదుపరి సినిమా రావడానికి చాలా టైమ్ పడుతుందేమో అనుకుంటే.. వెంటనే శర్వానంద్ సినిమా వచ్చేసింది. దీని గురించి చెబుతూ.. ''తను ఫ్లాప్ డైరక్టర్.. తనతో ఎందుకు సినిమా అని చాలామంది చెప్పారు. కాని నాకు అతను చెప్పిన కంటెంట్ నచ్చింది. అందుకే వెంటనే సినిమా ఓకె చేశాను. అందులో పెద్ద రిస్క్ ఏం లేదు. ఈసారి నేను హిట్టు కొడుతున్నానా లేదా అని మీరు కంగారు పడకండి.. నేను కొడుతున్నా అంతే'' అన్నాడు.

మొత్తానికి ఒక హీరోకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే. ఇదే విషయంపై హను మాట్టాడుతూ.. ''నేను చాలా డిప్రెషన్లో ఉన్న సమయంలో.. నాకు దాదాపు 12 ఏళ్ల నుండి తెలిసిన శర్వానంద్.. ఒక లవ్ స్టోరి ఉంది అనగానే.. లవ్ స్టోరీయా.. అయితే చేసేద్దాం అన్నాడు'' అని చెప్పాడు. మొత్తానికి ఈ సినిమా చుట్టూ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయిలే. రిజల్ట్ కూడా అలాగే వస్తే ఇంకా బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English