హీరో కూతురికి అందరూ ఫిదా

హీరో కూతురికి అందరూ ఫిదా

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో వారసత్వ సంప్రదాయం పాతుకుపోయిందని, బయటి వారికి అవకాశాలు సరిగా ఇవ్వరని కంగన రనౌత్‌ లాంటి వాళ్లు చాలా గోల చేసారు. అయితే ఎంత హీరోల కూతుళ్లు, కొడుకులు అయినా కానీ టాలెంట్‌ లేకుండా ప్రేక్షకులని ఆకట్టుకోలేరు. కరీనా కపూర్‌ అయినా, ఆలియా భట్‌ అయినా ఎంతో గొప్ప నటీమణులనేది కాదనలేని సత్యం.

అలాగే సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సైరా అలీ ఖాన్‌ కూడా ఏదో నాన్నని బట్టి హీరోయిన్‌ అయిపోయిందని కాకుండా మొదటి సినిమాలోనే టాలెంట్‌ చూపెట్టింది. 'కేదార్‌నాథ్‌' సినిమాలో సారా నటనకి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడామె రెండవ చిత్రం 'సింబా' విడుదలకి సిద్ధమవుతోంది. టెంపర్‌కి రీమేక్‌ అయిన ఈ చిత్రంలో ఆమె రణ్‌వీర్‌సింగ్‌ సరసన నటించింది.

కేదార్‌నాథ్‌ చిత్రంతో ఆమెకి మంచి పేరు రావడంతో పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. బాఘీ 3 చిత్రంలో సారా అలీ ఖాన్‌ కథానాయిక అని వార్తలొస్తున్నాయి. అదే నిజమయితే ఇక బాలీవుడ్‌లో రానున్న రోజుల్లో సారా దూకుడుకి కళ్లెం వేయడం మిగతా హీరోయిన్ల వల్ల కాదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English