త్రివిక్రమ్‌ గారూ.. కాస్త నవ్వండి!

త్రివిక్రమ్‌ గారూ.. కాస్త నవ్వండి!

అజ్ఞాతవాసిలో సీరియస్‌ సబ్జెక్ట్‌ని కామెడీ చేయడం బెడిసికొట్టడంతో అరవింద సమేత చిత్రంలో త్రివిక్రమ్‌ తన మార్కు వదిలేసి సీరియస్‌గా డీల్‌ చేసాడు. దీంతో త్రివిక్రమ్‌ నుంచి వినోదం ఆశించే ప్రేక్షకుల నుంచి పెదవి విరుపులు వచ్చాయి. సినిమాలో పలు సన్నివేశాలు ఆకట్టుకున్నా కానీ త్రివిక్రమ్‌ మార్కు హాస్యం లేదనే కంప్లయింట్‌ ఫైనల్‌గా సినిమాని విజయవంతం కానివ్వలేదు. అల్లు అర్జున్‌తో తీసే సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్‌ కాస్త సీరియస్‌ శైలిలో వెళదామని సూచించాడట.

అయితే దానికి అల్లు అర్జున్‌ కానీ, అల్లు అరవింద్‌ కానీ అసలు అంగీకరించలేదట. త్రివిక్రమ్‌ ట్రేడ్‌మార్క్‌ అంటేనే వినోదమని, అల్లు అర్జున్‌ కూడా వినోదాత్మక పాత్రలు చేసినపుడే పెద్ద విజయాలు సాధించాడని, కనుక ఈ చిత్రం కామెడీ పరంగా అస్సలు తగ్గకూడదని చెప్పారట. వింటేజ్‌ త్రివిక్రమ్‌ని, అంటే నువ్వు నాకు నచ్చావ్‌, మన్మథుడు తరహా వినోదాన్ని తలపించేలా ఈ చిత్రం వుండాలని తండ్రీ కొడుకులు ఖచ్చితంగా చెప్పారట. దీంతో స్టోరీ లైన్‌ ఎలా వున్నా ట్రీట్‌మెంట్‌ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసేలా వుంటుందట. జులాయి, రేసుగుర్రం తరహాలో అల్లు అర్జున్‌ పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రలో కనిపిస్తాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English