సాయి పల్లవి గురించి అన్నీ పుకార్లేనండీ!

సాయి పల్లవి గురించి అన్నీ పుకార్లేనండీ!

సాయి పల్లవి ఎంత టాలెంటెడ్‌ అనేది తెలిసిందే. దానికి తోడు ఆమె అంటే యువతకి అదో క్రేజు. మలయాళ ప్రేమమ్‌ చూసి తెలుగు యువత కూడా ఆమెకి మనసిచ్చేసారు. అందుకే ఫిదా, ఎంసిఏ సినిమాలు చూడడానికి ఆ రేంజులో ఎగబడ్డారు. సాయి పల్లవికి ఎంత టాలెంట్‌ వున్నప్పటికీ ఆమెకి పొగరు అని, సెట్లో హీరోలని గౌరవించదని పేరొచ్చేసింది. ఆమెతో కణంలో నటించిన నాగశౌర్య ఆమె ఆటిట్యూడ్‌ గురించి చాలా పేచీ పెట్టి ఆ చిత్రం ప్రమోషన్స్‌కి కూడా దూరంగా వుండిపోయాడు.

ఎంసిఏ టైమ్‌లో కూడా నాని అండ్‌ దిల్‌ రాజు ఆమెతో కాస్త ఇబ్బంది ఫేస్‌ చేసారనే టాక్‌ స్ప్రెడ్‌ అయింది. తన గురించి మంచి చెప్పడానికి ఎవరూ రానపుడు తన కొత్త చిత్రంలోని హీరో శర్వానంద్‌ మాత్రం సాయి పల్లవిపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. తన పనేదో తాను చేసుకుపోతుందని, తనకి ఆటిట్యూడ్‌ ప్రాబ్లమ్‌ వుందనే మాటలు తాను కూడా విన్నానని, కానీ అవన్నీ పుకార్లు మాత్రమేనని, చాలా ఫ్రెండ్లీ, కోపరేటివ్‌ కోస్టార్‌ అని కితాబిచ్చాడు. వీరిద్దరూ కలిసి నటించిన 'పడి పడి లేచె మనసు' ఈ శుక్రవారం విడుదలకి సిద్ధమవుతోంది. శర్వానంద్‌ లాంటి కూల్‌ గై నుంచి ఇలాంటి కాంప్లిమెంట్స్‌ అందుకున్న సాయి పల్లవికి ఇది పెద్ద సర్టిఫికెట్‌గానే పనికొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English