మోహన్ లాల్.. ఇదేం న్యాయం సారూ?

 మోహన్ లాల్.. ఇదేం న్యాయం సారూ?

మోహన్ లాల్ కొత్త సినిమా ‘ఒడియన్’కు మలయాళంలో మామూలు హైప్ రాలేదు. ఇది అక్కడి రికార్డులన్నింటినీ తిరగరాస్తుందని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. ‘ఒడియన్’కు తెలుగులోనూ ఓ మోస్తరుగా బజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. మోహన్ లాల్ చాలా చోట్లకు తిరిగి సినిమాను ప్రమోట్ చేశాడు. హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. మీడియాను కలిశాడు. అందరితో కలిసి ఒకేసారి మాట్లాడాడు. వన్ టు వన్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. కానీ ఇవేవీ సినిమాకు కలిసి రాలేదు. బ్యాడ్ టాక్ రావడంతో సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఐతే సినిమా రిలీజయ్యాక కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ బతికించే ప్రయత్నం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇదే మోహన్ లాల్ ఇంతకుముందు తెలుగులో నటించిన సినిమాల విషయంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘మనమంతా’ అనే సినిమా చేశాడు. దానికి కనీస స్థాయిలో ప్రచారం చేయలేదు. చంద్రశేఖర్ మామూలుగానే రిజర్వ్డ్‌గా ఉంటాడు. మీడియాను కలవడు. ఆ స్థితిలో సినిమాను ప్రచారం చేయాల్సింది మోహన్ లాలే. అలాంటి మేటి నటుడు తెలుగులో పూర్తి స్థాయి సినిమా చేసి.. కనీసం దీని గురించి ఒక మాట మాట్లాడలేదు.

ఇక్కడికొచ్చి ప్రమోట్ చేయలేదు. ‘మనమంతా’ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆడలేదు. ప్రచారం లేకపోవడమే అందుక్కారణం. ఇప్పుడు డబ్బింగ్ సినిమాను విరగబడి ప్రమోట్ చేసిన లాల్.. అప్పుడలా ఎందుకు చేశాడో మరి. ‘జనతా గ్యారేజ్’ సినిమా విషయంలోనూ లాల్ అలాాగే చేశాడు. అంత పెద్ద సినిమా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన కనీసం ఆడియో వేడుకకు వచ్చినా ఆ కళే వేరుగా ఉండేది. ఎన్టీఆర్‌తో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తే బాగుండేది. కానీ ఏమీ చేయలేదు. కానీ ఆ సినిమా వల్ల తనకు వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని డబ్బింగ్ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవాలని మాత్రం చూస్తున్నాడు. ఇదేం న్యాయం సారూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English