'రోబో' కష్టాలు వెల్లడించిన సూపర్ స్టార్

'రోబో' కష్టాలు వెల్లడించిన సూపర్ స్టార్

దక్షిణాది సినిమా సత్తా ఏంటో ఇండియా మొత్తానికి తెలిసేలా చేసిన సినిమా 'రోబో'. ఎనిమిదేళ్ల కిందటే రూ.180 కోట్ల బడ్జెట్లో.. ప్రపంచ స్థాయి సాంకేతిక హంగులతో తెర మీద అద్భుతాలు ఆవిష్కరించాడు శంకర్. ఆ సినిమా చూసి దక్షిణాది ప్రేక్షకులే కాదు.. బాలీవుడ్ ఆడియన్స్ కూడా విస్తుపోయారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా ఏంటని షాకయ్యారు. ఈ సినిమా అలా రావడానికి శంకర్ మాస్టర్ మైండే కారణం. కానీ అతడిని నమ్మి ఆ రోజుల్లో అంత ఖర్చు పెట్టి సినిమా తీయడం మాత్రం సామాన్యమైన విషయం కాదు.

సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ సాహసం చేశాడు. ఐతే నిజానికి 'రోబో'కు ముందు నిర్మాత ఆయన కాదు. వేరే నిర్మాణ సంస్థలో ఈ చిత్రం మొదలైందట. మధ్యలో బడ్జెట్ సమస్యలు మొదలైతే కళానిధి మారన్ దీన్ని టేకప్ చేశారట. ఆయన ఆ రోజుల్లో ఎంత పెద్ద సాహసం చేశారో.. తమకు ఎంతగా సపోర్ట్ ఇచ్చారో సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త సినిమా 'పేట్ట' ప్రమోషన్లలో భాగంగా వెల్లడించాడు. 'పేట్ట' సన్ పిక్చర్స్ బేనర్లోనే తెరకెక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''రోబో సినిమాను వేరే నిర్మాతలతో మొదలుపెట్టాం. ఐతే 30 శాతం చిత్రీకరణ పూర్తయ్యే సరికే బడ్జెట్లో 70 శాతం పూర్తయింది. దీంతో నిర్మాతలు కంగారు పడ్డారు. మిగతా 30 శాతం బడ్జెట్లోనే మిగిలిన 70 శాతం చిత్రీకరణ పూర్తి చేయాలని.. లేదంటే తమకు నష్టపరిహారం కట్టివ్వాలని అన్నారు. అలాంటి స్థితిలో కళానిధి మారన్ 'రోబో'ను టేకప్ చేశారు.

నన్ను, శంకర్‌ను చూసి ఇంకేం ఆలోచించకుండా సినిమాను తన చేతుల్లోకి తీసుకున్నారు. ముందున్న నిర్మాణ సంస్థకు చెల్లింపులు చేశారు. రాజీ లేకుండా సినిమాను పూర్తి చేశారు. కాబట్టే ఆ సినిమా అంత బాగా వచ్చింది. అంత పెద్ద విజయం సాధించింది. '2.0' కూడా ఆ సంస్థలోనే చేయాల్సింది. కానీ శంకర్ కథ తయారు చేసే సమయానికి సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ ఆపేసింది. దీంతో లైకా వాళ్లతో చేశాం. మళ్లీ సన్ వాళ్లు ప్రొడక్షన్ మొదలుపెట్టి నాతో సినిమా చేయాలన్నారు. కార్తీక్ రెండేళ్ల కిందట చెప్పిన కథతో 'పేట్ట' చేశాం'' అని రజనీ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English