రాసి పెట్టుకోండి.. ఈ సినిమా బ్లాక్ బస్టర్

రాసి పెట్టుకోండి.. ఈ సినిమా బ్లాక్ బస్టర్

తన కొత్త సినిమా 'పడి పడి లేచే మనసు'పై పిచ్చ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు హీరో శర్వానంద్. రాసి పెట్టుకోండి.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఈ సినిమా ప్రమోషన్లలో చాలా ధీమాగా చెప్పాడు శర్వానంద్. తాను అంతగా ఈ చిత్రాన్ని నమ్మడానికి కారణం కూడా చెప్పాడు శర్వానంద్. ఒక సినిమా కథ విన్నపుడు.. షూటింగ్ చేస్తున్నపుడే ఫలితం ఏంటో అర్థమవుతుందని.. ఈ సినిమా తనలో చాలా పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చిందని శర్వా తెలిపాడు.

నిజానికి తాను కథ విన్నపుడే ఈ సినిమా చాలా బాగుంటుందని అనుకున్నానని.. ఇక షూటింగ్ అయ్యాక కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందనిపించిందని శర్వా చెప్పాడు. కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా మనల్ని వెంటాడుతాయని..  రాత్రిపడుకునే ముందు వాటిని గుర్తు చేసుకుంటామని.. 'గీతాంజలి', 'సఖి', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'అర్జున్ రెడ్డి' లాంటి చిత్రాలు ఆ కోవలోకి వస్తాయని.. 'పడి పడి లేచె మనసు' సైతం అలాంటి సినిమానే అని.. ఇది ప్రేక్షకుల్ని వెంటాడుతుందని శర్వా చెప్పాడు.

నిజానికి 'మహానుభావుడు' తర్వాత మూడు సినిమాలు చేసి.. ఆ తర్వాత 'పడి పడి లేచె మనసు' చేయాల్సిందని.. కానీ కొన్ని కారణాల వల్ల మిగతావి క్యాన్సిల్ చేసి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చానని శర్వా తెలిపాడు. 'లై' లాంటి ఫ్లాప్ తీసినప్పటికీ దర్శకుడు హను రాఘవపూడి మీద నిర్మాత ఎంతో నమ్మకం పెట్టాడని.. ఈ చిత్రానికి తాను, సాయిపల్లవి మినహా ఆకర్షణలు లేకపోయినప్పటికీ ఏమాత్రం రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టారని.. కేవలం కథను నమ్మి ఈ సినిమా తీశాడని.. అలాంటి నిర్మాతలే ఇండస్ట్రీకి అవసరమని చెప్పాడు శర్వా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English