బన్నీతో షారుఖ్ రోజంతా గడుపుతాడట

బన్నీతో షారుఖ్ రోజంతా గడుపుతాడట

ఒకప్పట్లా సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు తక్కువగా చూసే పరిస్థితి లేదు. వాళ్లను మించిన బడ్జెట్లలో.. వాళ్లను మించిన భారీతనంతో ఇక్కడ కళ్లు చెదిరే సినిమాలు వస్తున్నాయి. సౌత్ సినిమాల్ని చూసి బాలీవుడ్ వాళ్లే ఇన్ఫీరియర్‌గా ఫీలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడి స్టార్ హీరోల్ని కూడా బాలీవుడ్ వాళ్లు తక్కువగా చూసే పరిస్థితి లేదు. ఎవరేంటన్నది వాళ్లు బాగానే తెలుసుకుంటున్నారు.

తమ సినిమాల ప్రమోషన్ల కోసం సౌత్‌కు వచ్చినపుడు మన స్టార్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సైతం తాజాగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇలాగే మాట్లాడాడు. తన కొత్త సినిమా ‘జీరో’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన.. బన్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బన్నీకి మీరంటే చాలా ఇష్టం.. మీకు అతను పెద్ద ఫ్యాన్ అని ఒక మీడియా ప్రతినిధి షారుఖ్ వద్ద ప్రస్తావించగా.. అందుకు సంతోషం వ్యక్తం చేశాడు కింగ్ ఖాన్. అల్లు అర్జున్ స్వీట్ పర్సన్ అని.. అతను అపార ప్రతిభావంతుడని షారుఖ్ అన్నాడు. ఎప్పుడో ఒక రోజు తాను అల్లు అర్జున్ కోసమే హైదరాబాద్ వస్తానని.. పూర్తిగా ఒక రోజంతా అతడితో గడుపుతానని షారుఖ్ పేర్కొనడం విశేషం.

ఒక ఐదారేళ్ల కిందటి వరకు బన్నీ జస్ట్ తెలుగు స్టార్ మాత్రమే. కానీ తర్వాత మలయాళంలో అతను భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కర్ణాటకలోనూ మార్కెట్ పెంచుకున్నాడు. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన సైతం అతడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతో అతడి గురించి బాలీవుడ్ వాళ్లు కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే షారుఖ్ కూడా బన్నీ గురించి ఇలా మాట్లాడాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English