పడి పడి లేచె మనసు కాపీ స్టోరీనా?

 పడి పడి లేచె మనసు కాపీ స్టోరీనా?

వచ్చే వారం విడుదల కానున్న పడి పడి లేచె మనసు చిత్రంపై అంచనాలయితే బాగానే వున్నాయి. శర్వానంద్‌, సాయి పల్లవి జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రంలో హీరో ఒక యాక్సిడెంట్‌ తర్వాత గతం మరచిపోయి, ప్రేయసి గుర్తు లేకపోతే అతడిని మళ్లీ ఆమె ఎలా గెలుచుకుంటుందనేది కథ అంటున్నారు. ఇదే లైన్‌తో ఈ యేడాదిలోనే 'తేజ్‌ ఐ లవ్యూ' చిత్రం వచ్చింది. సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమతో కరుణాకరన్‌ తీసిన ఆ సినిమా సక్సెస్‌ కాలేదు. మూడు కోట్ల కంటే తక్కువ షేర్‌ వచ్చిన ఆ చిత్రాన్ని ఎక్కువ మంది చూడలేదు.

ఒకవేళ దీని కథ దాంతో సిమిలర్‌గా వున్నా పెద్దగా నష్టం వుండదు కానీ నిజంగా హను రాఘవపూడి ఈ కథని కాపీ కొట్టాడా? లేక సిమిలర్‌ ఐడియా తనకీ వస్తే తనదైన శైలిలో దానిని తెరకెక్కించాడా? తేజ్‌లో హీరోయిన్‌ గతం మరచిపోతే హీరో అవస్థలు పడతాడు. ఇక్కడ సీన్‌ రివర్స్‌ అన్నమాట. అంటే సాయి పల్లవికి పర్‌ఫార్మెన్స్‌ పరంగా చాలా స్కోప్‌ వుందన్నమాట.

అందుకేనేమో చాలా కథలు విని రిజెక్ట్‌ చేసిన సాయి పల్లవి 'పడి పడి లేచె మనసు' మాత్రం సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసేసింది. గత చిత్రం 'లై'తో చాలా పెద్ద ఎదురుదెబ్బ తిన్న హను రాఘవపూడిలో మళ్లీ ఫామ్‌లోకి వస్తాననే ధీమా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English