వైఎస్ సినిమాను చంపేసేలా ఉన్నారే..

వైఎస్ సినిమాను చంపేసేలా ఉన్నారే..

నందమూరి తారక రామారావు బయోపిక్ తెరమీదికి వచ్చిన సమయంలోనే మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కబోయే సినిమా కూడా వార్తల్లోకి వచ్చింది. దాదాపుగా ఈ రెండు చిత్రాలూ ఒకేసారి చిత్రీకరణ మొదలు పెట్టుకున్నాయి. కాస్త ఇటు అటుగా పూర్తయ్యాయి.

ఐతే ‘యన్.టి.ఆర్’ స్థాయిలో కాకపోయినా ‘యాత్ర’పై మొదట్లో జనాల్లో బాగానే ఆసక్తి కనిపించింది. తరచుగా సినిమాను వార్తల్లో నిలబెడుతూ సాగింది చిత్ర బృందం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన కానుకగా డిసెంబరు 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని కూడా ఇంతకుముందు ప్రకటించారు. ఆ తర్వాత సంక్రాంతి రిలీజ్ అన్నారు. ఈ రెండు డేట్లలో ఎప్పుడు రిలీజైనా ‘యాత్ర’కు హైప్ ఉండేదేమో. కానీ సినిమా రెడీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాయిదా వేశారు.

ఇప్పుడు కొత్తగా ఫిబ్రవరి 8న అంటూ రిలీజ్ డేట్ ఇచ్చారు. మామూలుగా ఫిబ్రవరి అంటే అన్ సీజన్. ఆ నెలలో సినిమాలు ఆడటం కష్టం. ఏవైనా స్పెషల్ మూవీస్ అయితే ఆదరణ దక్కుతుంది. యూత్ ఫుల్ మూవీస్ అయితే నెట్టుకొచ్చేస్తాయి. కానీ ‘యాత్ర’ లాంటి పొలిటికల్ మూవీ రిలీజ్‌కు అది సరైన టైమింగ్ కాదు. అసలే ఈ చిత్రం ‘యన్.టి.ఆర్’ లాగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందా అన్నది సందేహంగా ఉంది. పైగా మధ్యలో ప్రమోషన్ ఆపేయడం.. సినిమాను వాయిదా వేయడం వల్ల ఉన్న కొంచెం ఆసక్తి కూడా తగ్గింది. దీనికి తోడు ఫిబ్రవరిలో రిలీజ్ అనేసరికి ఇది ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో అన్న సందేహాలు కలుగుతుున్నాయి. మరి మహి కె.రాఘవ్ టీం ఆలోచనేంటో చూడాలి. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద నిర్మించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English