ఎన్టీఆర్ రాకుంటే గట్టి డ్యామేజే..

ఎన్టీఆర్ రాకుంటే గట్టి డ్యామేజే..

తెలుగు సినిమాలకు అది పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి సమయం దగ్గర పడుతోంది. ఆ సీజన్లో రాబోయే సినిమాలకు ప్రమోషన్ హడావుడి మొదలైంది. ముందు నుంచి తమ చిత్రాన్ని ఉద్ధృతంగా ప్రమోట్ చేస్తున్న ‘యన్.టి.ఆర్’ టీం.. ఇక ప్రమోషన్లను మరో స్థాయికి తీసుకెళ్లాలనుకుంటోంది. ఇంకో రెండు రోజుల్లోనే ట్రైలర్ లాంచ్ చేసి.. ఆ తర్వాత ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులో ఈ చిత్ర ఆడియో వేడుక పెద్ద ఎత్తున చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

‘యన్.టి.ఆర్’ ఆడియో వేడుకను ఇంకెక్కడైనా చేస్తే కథ వేరు. కానీ ఎన్టీఆర్ సొంత ఊరిలోనే చేస్తుండటం వల్ల నందమూరి కుటుంబానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుక. మొత్తం నందమూరి కుటుంబం అంతా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరికీ బాలయ్య ఆహ్వానాలు కూడా పంపినట్లు తెలుస్తోంది.

ఐతే ఎంత మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆ కళే వేరుగా ఉంటుంది. మొత్తం నందమూరి కుటుంబ సభ్యులందరూ ఉండి వారి మధ్య తారక్ ఉంటే అభిమానులకు చూడముచ్చటగా ఉంటుంది. కానీ బాలయ్య ఎన్టీఆర్‌ను ఈ వేడుకకు పిలిచాడా లేదా అన్న దానిపై సమాచారం లేదు. నిజంగా తారక్‌ను పిలిచి ఉంటే ఈపాటికే టాలీవుడ్ పీఆర్వోలు ఈ విషయమై ట్వీట్లు చేసేవాళ్లు. కానీ అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య, ఎన్టీఆర్‌ల మధ్య దూరం తగ్గినట్లే కనిపించింది.

‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌కు కూడా బాలయ్య వచ్చాడు. కానీ నందమూరి సుహాసిని ఎన్నికల ప్రచారానికి తారక్ రాకపోవడంతో వీరి సంబంధాలపై మళ్లీ చర్చ జరిగింది. ఆ సంగతలా వదిలేస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ రాకపోతే నింద బాలయ్యే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వేడుకకు ఉన్న ప్రాధాన్యం.. ఇది జరుగుతున్న ప్రదేశాన్ని బట్టి చూస్తే ఆయన పిలిస్తే ఎన్టీఆర్ రాకుండా ఉండడు. మరి మిగతా నందమూరి కుటుంబ సభ్యులందరినీ పిలిచి తారక్‌ను పిలవకుంటే మాత్రం అతడి మీద ఉన్న వివక్ష గురించి మరోసారి చర్చ జరుగుతుంది. బాలయ్య బ్లేమ్ అవుతాడు. ఇది ఆయనకు డ్యామేజే కాబట్టి తారక్‌ను పిలిచి తీరాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English