మూడు సినిమాల్లో మూడు వెరైటీ ప్రేమకథలు

మూడు సినిమాల్లో మూడు వెరైటీ ప్రేమకథలు

ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా 2018ని దిగ్విజయంగా ముగించేసి.. చక్కగా 2019ను ఒక బ్యాంగ్ తో మొదలెట్టాలని చూస్తున్నారు. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్ 2 వంటి సినిమాలు రెడీ అయిపోతున్నాయి. అయితే 2018కి గుడ్ బాయ్ చెప్పడానికి కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి.

పూర్తి స్థాయి లవ్ స్టోరీగా వస్తున్న పడిపడి లేచెను మనస్సు.. స్పేస్ జానర్ లో రూపొందిన అంతరిక్షం.. అబ్బురపొడిచే విఎఫ్ ఎక్స్ తో గోల్డ్ మైనింగ్ కథాంశంతో వస్తున్న కెజిఎఫ్‌ సినిమాలు డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాల్లోనూ వెరైటీ ప్రేమకథలు ఉన్నాయట. శర్వానంద్-సాయిపల్లవి సినిమాలో ప్రేమకథే హైలైట్. ఇక అంతరిక్షం సినిమాలో హీరో వరుణ్‌ తేజ్ తన గోల్ రీచ్ కాలేకపోవడానికి కారణం తన ప్రేమకథలోని ట్విస్ట్ అంట. అలాగే కెజిఎఫ్‌ సినిమాలో కూడా అసలు హీరో పాత్రను క్రూరంగా డ్రైవ్ చేసేదే అతని ప్రేమ కథ అని తెలుస్తోంది.

మొత్తానికి చాలాకాలంగా మన మర్చిపోయిన ప్రేమకథలను మరోసారి మనోళ్ళు విభిన్న కోణంలోనుండి వెండితెరపై వర్ణించడానికి రెడీ అయిపోతున్నారు. ప్రేక్షకులు కూడా వాటిని చూసి తరించడానికి రెడీగానే ఉన్నారు కాబట్టి.. ఈ సినిమాలు హిట్టు కొట్టడమే తరువాయి!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English