కౌన్సిల్ కు చేరిన మెహ్రీన్ అడ్వాన్స్ రచ్చ

కౌన్సిల్ కు చేరిన మెహ్రీన్ అడ్వాన్స్ రచ్చ

ఒక ప్రక్కన సినిమాలు ఆడట్లేదు. మరో ప్రక్కనేమో ఒప్పుకున్న సినిమాలతో పేచీలు. ప్రస్తుతం పంజాబి ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ పీర్జాదా పరిస్థితి ఇదే. అమ్మడు వరుసగా సినిమాలను సైన్ చేసినా కూడా.. అందులో ఒక్కటి కూడా హిట్టు కాకపోవడంతో ఒక ప్రక్కన చాలా ఫీలవుతుంటే.. ఇప్పుడేమో తీసుకున్న అడ్వాన్స్ ఇచ్చేయమని ఒక ప్రొడ్యూసర్ గొడవ చేస్తున్నాడట.

సుధీర్ బాబుతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది మెహ్రీన్. ఆ తరువాత ఆ సినిమా నుండి సుధీర్ పక్కకు తప్పేసుకున్నాడు. వెంటనే ఆ కథను మెగావారి ఇంటల్లుడు కళ్యాణ్‌ దేవ్ కు చెప్పడంతో, అతను సినిమా చేసేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ముందు మెహ్రీనే హీరోయిన్. కాని మెగా అల్లుడు రాగానే ఈక్వేషన్లు మారిపోయి ఇప్పుడు మరో హీరోయన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మెహ్రీన్ చేయలేదో వాళ్లే తీసేశారో తెలియదు కాని.. అమ్మడుని అడ్వాన్స్ తిరిగిచ్చేయ్ అన్నారట.

అయితే మెహ్రీన్ అందుకు ససేమిరా అనడంతో, ఇప్పుడు రచ్చంతా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు చేరింది. నా డేట్లు వేస్ట్ చేశారు, రెండు పెద్ద సినిమాలు పోయాయ్ అంటూ మెహ్రీన్ గోల పెడుతుంటే.. ఆమెకూ ఆమె స్టయిలిస్టుకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయాలంటూ ప్రొడ్యూస్ డిమాండ్ చేస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English