భలే ఛాన్సుంది.. వాడుకునేదెవరో?

భలే ఛాన్సుంది.. వాడుకునేదెవరో?

‘2.0’ రిలీజైన వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ డల్లయింది. ఆ సినిమా కొంచెం వీక్ అవ్వగా.. తర్వాత వచ్చిన సినిమాలేవీ నిలబడలేదు. ‘కవచం’తో పాటుగా గత వారం వచ్చిన ‘నెక్స్ట్ ఏంటి’.. ‘సుబ్రహ్మణ్యపురం’.. ‘శుభలేఖలు’ బాక్సాఫీస్ పరీక్షకు నిలవలేకపోయాయి. వీకెండ్లోనే ఈ చిత్రాలకు వసూళ్లు సరిగా రాలేదు. ఇక వీకెండ్ తర్వాత పరిస్థితి చెప్పాల్సిన పని లేదు.

తర్వాతి వారం క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కొంచెం పెద్ద రేంజి సినిమాలుండటంతో ఈ వారాంతం కూడా చిన్న సినిమాలకే వదిలేశారు. ఆల్రెడీ ‘2.0’ పరిమిత సంఖ్యలో ఉన్న త్రీడీ స్క్రీన్లలో మినహా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఒక గత వారం సినిమాల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో ఈ వారం వచ్చే సినిమాలకు మంచి అవకాశమే ఉంది.

ఈ వీకెండ్లో ‘భైరవగీత’తో పాటు ‘హుషారు’.. డబ్బింగ్ సినిమాలు ‘ఒడియన్’.. ‘సముద్ర పుత్రుడు’ రిలీజవుతున్నాయి. వర్మ నిర్మాణంలో తెరకెక్కి వాయిదాల మీద వాయిదాలు పడిన ‘భైరవగీత’ ఎట్టకేలకు రిలీజవుతోంది. ఈ చిత్రం వారం ముందే కన్నడలో రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంది. మరి తెలుగులో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇది ‘రక్త చరిత్ర’ స్టయిల్లో కనిపిస్తోంది.

ఇక అర్బన్ యూత్ ను టార్గెట్ చేసిన ‘హుషారు’ ఆ వర్గం ప్రేక్షకులకు మంచి వినోదం పంచేలా కనిపిస్తోంది. మరోవైపు మోహన్ లాల్ నటించిన ‘ఒడియన్’ భిన్నమైన సినిమాలా ఉంది. ఆయన నటనను ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఛాయిసే. ఇక హాలీవుడ్ ఫాంటసీ చిత్రాల్ని ఇష్టపడేవారికి ‘సముద్ర పుత్రుడు’ మంచి ఛాయిస్. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఓపెన్‌గా కనిపిస్తున్న బాక్సాఫీస్ బ్యాటిల్ ఫీల్డ్‌లో ఏ సినిమా ఏమేరకు సత్తా చాటుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English