తోడల్లుళ్ళ చేతిలో హీరోయిన్ల జాతకం

తోడల్లుళ్ళ చేతిలో హీరోయిన్ల జాతకం

తమన్నాకి బాహుబలి తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. ఆ చిత్రంతో అందరూ టాప్‌కి వెళ్లిపోతే తమన్నా మాత్రం వున్న క్రేజ్‌ పోగొట్టుకుంది. అప్పుడే యాభై యేళ్ల హీరోల పక్కన నటించే అవసరం వచ్చింది. వచ్చిన సినిమాలు వచ్చినట్టే పోతూ వుండడంతో 'ఎఫ్‌ 2'లో వెంకీ సరసన నటించే అవకాశాన్ని మిస్‌ చేసుకోకూడదని వెంటనే ఓకే చేసేసింది. ఈ చిత్రంలో భర్తని హింసించే గయ్యాళి భార్యగా ఆమె కనిపిస్తుంది. ఈ చిత్రంలో మరో జంట కూడా వున్నా కానీ వీరిద్దరిదీ హైలైట్‌గా వుంటుందని చెబుతున్నారు.

ఇకపోతే ఎఫ్‌2లో మరో హీరోయిన్‌ అయిన మెహ్రీన్‌ పరిస్థితి కూడా అలాగే వుంది. ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపవుతూ వుండడంతో మెహ్రీన్‌పై ఐరెన్‌లెగ్‌ ముద్ర పడే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇటీవల విడుదలైన కవచంతో మరో డిజాస్టర్‌ చవిచూసిన మెహ్రీన్‌ ఎఫ్‌2లో వరుణ్‌ తేజ్‌ సరసన నటిస్తోంది. ఆమెది కూడా గయ్యాళి భార్య పాత్రే. వెంకీ, వరుణ్‌ తేజ్‌ తోడల్లుళ్ళుగా కనిపించే ఈ చిత్రంతో ఈ ఇద్దరి హీరోయిన్ల జాతక తేలనుంది. చాలా ఫన్నీగా కనిపిస్తోన్న ఈ చిత్రం సక్సెస్‌ అయితే తమన్నా, మెహ్రీన్‌ల ఫ్లాప్‌ ఫ్రస్ట్రేషన్‌ తీరిపోతుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English